సంక్రాంతి పండుగ కానుకగా గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు రిలీజ్ కాగా ఈ మూడు సినిమాలలో మొదట విడుదలైన గేమ్ ఛేంజర్ నెగిటివ్ పబ్లిసిటీ వల్ల అంచనాలను అందుకోలేకపోయినా డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు మాత్రం కలెక్షన్ల విషయంలో అదరగొడుతున్నాయి. ఫుల్ రన్ లో సంక్రాంతికి వస్తున్నాం రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధించే ఛాన్స్ ఉంది.
 
బుక్ మై షో వెబ్ సైట్ లో మూడు రోజుల్లోనే ఈ సినిమాకు సంబంధించి 15 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయని భోగట్టా. ఈ సినిమాకు సంబంధించి గంటకు 20 వేల టికెట్లు అమ్ముడవుతుండగా డాకు మహారాజ్ సినిమాకు గంటకు 4000 రేంజ్ లో గేమ్ ఛేంజర్ సినిమాకు గంటకు 2000 కంటే తక్కువగా బుకింగ్స్ జరుగుతున్నాయి.
 
అయితే మూడు సినిమాల నిర్మాతలు సేఫ్ అయినట్టేనని తెలుస్తోంది. గేమ్ ఛేంజర్ సినిమా ద్వారా వచ్చిన నష్టాలు సంక్రాంతికి వస్తున్నాం సినిమా ద్వారా భర్తీ అయ్యాయి. సంక్రాంతి సినిమాల ఫుల్ రన్ కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది. సంక్రాంతి సినిమాల ఫుల్ రన్ కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద మరిన్ని సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
 
సంక్రాంతి సినిమాల కలెక్షన్లు అంతకంతకూ పెరగాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. టికెట్ రేట్లను కొంతమేర తగ్గిస్తే బాగుంటుందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. వచ్చే సోమవారం నుంచి అన్ని సినిమాలు థియేటర్లలో తక్కువ టికెట్ రేట్లతోనే ప్రదర్శితం అయ్యే అవకాశం అయితే ఉంది. సంక్రాంతి సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ కు శుభారంభాన్ని ఇచ్చాయనే చెప్పాలి. టాలీవుడ్ ఇండస్ట్రీకి 2025 సినిమాలు ఏ స్థాయిలో విజయాలను అందిస్తాయో చూడాల్సి ఉంది. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన  యంగ్ జనరేషన్ స్టార్ హీరోల సినిమాలు రాబోయే రోజుల్లో మరిన్ని సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.






మరింత సమాచారం తెలుసుకోండి: