కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హ్యుజ్ ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారు దానికి కారణం 'గేమ్ ఛేంజర్ '  సినిమా అన్న విషయం అందరికీ తెలిసిందే .  గేమ్ ఛేంజర్ సినిమా బాగా నరుత్సాహపరిచింది. శంకర్ అభిమానులు అసలు ఇక శంకర్ డైరెక్టర్ గా సినిమాలు తీయడం వేస్ట్ అంటూ కొట్టి పడేశారు . జెంటిల్మెన్ , ప్రేమికుడు , భారతీయుడు , జీన్స్ . ఒకే ఒక్కడు , బాయ్స్ , అపరిచితుడు , శివాజీ , రోబో లాంటి ఎన్నో బిగ్ బ్లాక్ బస్టర్ సినిమాలను అందించిన స్టార్ డైరెక్టర్ శంకర్ ఎందుకు ఇప్పుడు ఆ స్థాయిలో సినిమాలను తెరకెక్కించలేకపోతున్నాడు అంటూ ఫీల్ అయిపోతున్నారు .


పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కిన సినిమా 'గేమ్ చేంజర్'. ఈ సినిమా జనవరి 10వ తేదీ రిలీజ్ అయ్యింది. నెగిటివ్ టాక్ దక్కించుకుంది. పరమ చెత్త సినిమా అంటూ సొంత ఫ్యాన్స్ కూడా మండిపడేలా ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు శంకర్.  అయితే గేమ్ చేంజర్ సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణం ఏంటి అన్న విషయాన్ని బయట పెట్టాడు శంకర్ . గేమ్ చేంజర్ సినిమా గురించి మాట్లాడుతూ.." ప్రతి ఫిలిం మేకర్ కి కూడా ఎంత చేసినా పూర్తి సంతృప్తి ఇవ్వదు . అది అందరికీ తెలుసు . ఖచ్చితంగా ఇంకా మెరుగ్గా చేయగలను అనే నమ్మకం ఉంటుంది . గేమ్ చేంజర్ సినిమా పట్ల నేను పూర్తిగా సంతృప్తిగా లేను..సినిమా మొత్తం నిడివి దాదాపు 5 గంటలు పైనే వచ్చింది. కానీ సమయం సరిపోక కొన్ని సన్నివేశాలను ట్రిమ్ చేయాల్సి వచ్చింది. దీంతో అసలు కథ ఏంటి అన్న విషయం క్లారిటీ లేకుండా అయిపోయింది. దానివల్ల సినిమా ఫ్లాప్ అయి ఉండొచ్చు.. నెగిటివ్ టాక్ దక్కించుకొని ఉండొచ్చు . యూట్యూబ్లో రివ్యూ మాత్రం నేను చూడలేదు "అంటూ చెప్పుకొచ్చాడు.



అయితే దీని పట్ల ఇప్పుడు ఫ్యాన్స్ ఫుల్ ఫైర్ అయిపోతున్నారు . దాదాపు 5 గంటల సినిమా తెరకెక్కించావు అంటే రెండు గంటల సినిమా వేస్ట్ అయిపోయినట్లు .. రెండున్నర గంట సినిమానే ఇప్పుడు తెరపై చూపించావు అంటే నిర్మాత దిల్ రాజుకి ఎంత డబ్బులు నష్టం కలిగి ఉంటుంది అంటూ ఫైర్ అయిపోతున్నారు . అసలు నువ్వు ఇలా ఎలా చేయగలవు శంకర్ ..? ఇన్ని సినిమాలను డైరెక్ట్ చేసిన ఎక్స్పీరియన్స్ నీకు ఉంటుంది కదా..?  మరి ఆ ఎక్స్పీరియన్స్ ఎలా పోయింది ..? అంటూ ఫైర్ అయిపోతున్నారు. సోషల్ మీడియాలో ప్రజెంట్ శంకర్ పై ట్రోలింగ్ దారుణంగా జరుగుతుంది. అయితే శంకర్ మాత్రం ట్రోలింగ్ గురించి ఏ విధంగా స్పందించడం లేదు..!?

మరింత సమాచారం తెలుసుకోండి: