టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు - క్రియేటివ్ డైరెక్టర్ రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న మూవీ SSMB 29. ఈ మూవీకి ఇంకా పేరు పెట్టకపోయినా SSMB 29గా ఫేమస్ అయిపోయింది. గ్లోబల్ మూవీ కోసం యావత్తు సినీ ప్రపంచం ఎదురు చూస్తుంది. యాక్షన్‌ అడ్వెంచర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. పాన్ వరల్డ్ మూవీగా నిర్మిస్తున్న ఈ సినిమా పూజ కార్యక్రమాన్ని చేపట్టారు.సాధారణంగానే రాజమౌళి మూవీ అంటే క్రేజ్ మామూలుగా ఉండదు. అది కూడా సూపర్ స్టార్ మహేశ్ బాబు, రాజమౌళి కాంబో మూవీ అంటే.. భారీ అంచనాలు నెలకొన్నాయి. రాజమౌళి, మహేష్ బాబు చిత్రం ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో అడ్వెంచర్ చిత్రంగా తెరకెక్కనుంది. ఆఫ్రికన్ రచయిత విల్బర్ స్మిత్ రచించిన నవల ఆధారంగా రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబు సాహస వీరుడిగా కనిపిస్తారు. ఈ సినిమా కోసం మహేష్ తన లూక్‌ని మార్చేశారు. పొడవాటి జుట్టుతో జుంపాలు పెంచుకుని.. చాలా హాండ్‌సమ్‌గా కనిపిస్తున్నారు.ఇదిలావుండగా ప్రస్తుతం మహేష్ బాబుకి అనుకూలంగా కొన్ని సీన్లను మార్చాలనే ప్రయత్నంలో రాజమౌళి ఉన్నట్టుగా తెలుస్తోంది.

ఇక దానికోసమే విజయేంద్ర ప్రసాద్ రాసిన కథలో కొన్ని మార్పులు చేర్పులను చేస్తూ రాజమౌళి తనకు అనుకూలంగా స్క్రీన్ ప్లేని రాసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. మరి స్క్రీన్ ప్లే రాసుకునే సమయంలో కథలో కొన్ని ఎలిమెంట్స్ తీసేయాల్సిన అవసరం అయితే ఉంటుంది.కాబట్టి అలాంటి సందర్భంలో దర్శకుడికి పూర్తి స్వేచ్ఛ ఉంటుందని రచయితను అడగాల్సిన అవసరం లేకుండా తనకు ఎలా అయితే సీన్ కన్వే అవుతుందో అలాంటి వే లోనే స్క్రీన్ ప్లే ను డిజైన్ చేసుకొని ముందుకు సాగుతుంటార. మరి ఇప్పటివరకు మహేష్ బాబు కి పాన్ వరల్డ్ లో ఎలాంటి ఇమేజ్ అయితే లేదు. ఇది కేవలం రాజమౌళి సినిమా అనే ఈ మూవీ మీద మంచి హైప్ అయితే పెంచుకుంటున్నారు.మరి ఈ హైప్ ని అందుకుంటూ ఈ సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: