రామ్‌చరణ్‌ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఆర్‌సీ 16గా ఇది ప్రచారంలో ఉంది. ఇప్పటికే ఇది పట్టాలెక్కింది.ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తి కాగా.. ప్రస్తుతం షూటింగ్‌ జరుగుతోంది. ఈ మూవీలో టాలీవుడ్ నటుడు జగపతి బాబు కీ రోల్ ప్లే చేస్తున్నారు. షూట్‍లో బిజీగా ఉన్నారు. తాజాగా ఈ మూవీ షూట్‌కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా లో షేర్ చేశారు.రీఎంట్రీ తర్వాత జగపతి బాబు ప్రయోగాత్మక పాత్రలు చేస్తూ మరింత బిజీ అవుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా విలన్ గా టర్న్ తీసుకున్న తర్వాత జగపతి బాబు బిజీ స్టార్ అయిపోయారు. ప్రతి సినిమాలోనూ ఆయన పాత్ర విభిన్నంగా ఉంటుంది. రీసెంట్ గా 'పుష్ప 2' సినిమాలో జగపతి బాబు గుర్తుపట్టలేని విధంగా సరికొత్త పాత్రలో నటించి ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు రామ్ చరణ్ సినిమాలో తనకు బాగా పని పడింది అంటూ ఓ వీడియోను షేర్ చేశారు జగపతిబాబు. అందులో తన మేకోవర్, పాత్ర రెండూ కొత్తగా ఉంటాయని వెల్లడించారు. తాజాగా షేర్ చేసిన ఈ వీడియోలో తన పాత కోసం జగపతి బాబు మేకప్ వేసుకుంటూ కనిపించారు. ఈ వీడియోకి "చాలా కాలం తర్వాత బుచ్చిబాబు ఆర్సి 16 కోసం బాగా పని పెట్టాడు. గెటప్ చూసాక నాకు చాలా తృప్తిగా అనిపించింది అంటూ రాసుకొచ్చారు.దీంతో ప్రస్తుతం జగపతిబాబు షేర్ చేసిన ఆ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.ఇదిలావుండగా ఆర్సీ16గా తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన దేవర భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా కనిపించనుంది.ఈ సినిమాను బుచ్చిబాబు స్పోర్ట్స్‌ డ్రామాగా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. గ్రామీణ నేపథ్యంలో సాగే కథతో ఈ మూవీని రూపొందిస్తున్నారు. ఇందులో కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి రెహమాన్ సంగీతమందిస్తున్నారు.ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌, వృద్ధి సినిమాస్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: