టాలీవుడ్ రెబల్ స్టార్ ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ సినిమాలను లైన్లో పెడుతున్న విషయం తెలిసిందే. అయితే ప్రభాస్ ప్రస్తుతం పూర్తి చేయాల్సిన సినిమాల లిస్ట్ అయితే పెద్దగానే ఉంది. ఇక ప్రభాస్ మరో రెండు మూడు నెలల్లో కొత్త ప్రాజెక్టులను కూడా ఎనౌన్స్ చేయబోతున్నట్లుగా కొన్ని కథనాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో సుకుమార్ తో కూడా ఒక సినిమా ఫిక్స్ కాబోతున్నట్లుగా టాక్ అయితే వినిపిస్తుంది.సుకుమార్ ప్రస్తుతం పుష్ప 2 సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూ,రాంచరణ్ rc16 పనిలో బిజీగా ఉన్నాడు.ప్రజెంట్ ప్రభాస్ కూడా ది రాజా సాబ్ ని పూర్తి చేసే పనిలో ఉణ్నాడు. ఫౌజీ కూడా జూన్ లోగా పూర్తవుతుందని తెలుస్తోంది. తర్వాత వెంటనే స్పిరిట్ మూవీ పట్టాలెక్కించేందుకు సందీప్ రెడ్డి రెడీ అయ్యాడు. ఆతర్వాత సలార్2 కూడా క్యూలో ఉంది. కల్కీ 2 ప్రీ ప్రొడక్షన్ పనులు సమ్మర్ లో మొదలౌతాయని తెలుస్తోంది.. ఎలా చూసినా రెండు మూడేళ్ల వరకు ప్రభాస్ ఫుల్ బిజీ అయ్యే ఛాన్స్ ఉంది.కాబట్టి ఇప్పట్లో సుకుమార్ తో ప్రభాస్ మూవీ జరిగే పని కాదు. కాని 2027 లో మాత్రం జరిగే ఛాన్స్ఉంది. ఆలోగా రామ్ చరణ్ తో సుకుమార్ సినిమా పూర్తవుతుంది కాబట్టి, అప్పుడే ప్రభాస్ కమిటైన సినిమాలు పూర్తవుతాయని తేలింది కాబట్టి, 2027 లో ఈ కాంబినేషన్ వర్కవుట్ అవ్వొచ్చు.దాని గురించే ప్రభాస్ ని కలుస్తున్నాడట సుకుమార్. ఆర్టిఫిషీయిల్ ఇంటలీజెన్స్ వాడి, ప్రభాస్ లో భారీ ఎత్తున పాన్ వరల్డ్ మూవీఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు సుకుమార్. దానికి 90 శాతం పని ఆర్టిఫిషియల్ ఇంటలీజెన్స్ తోనే కాబట్టి, ఇప్పటి నుంచే ఆ ప్రాజెక్టు పనులు మొదలు పెట్టాడట సుకుమార్… సో ఇలా చరణ్ సినిమా ప్లాన్ చేస్తూనే, ప్రభాస్ ప్రాజెక్టుని కూడా పట్టాలెక్కించేందుకు గ్రౌండ వర్క్ స్టార్ట్ చేశాడు సుకుమార్.దీంతో సుకుమార్ ప్రభాస్ కాంబో పై మొత్తానికి ఫ్యాన్స్ కు ఒక క్లారిటీ వచ్చేసింది. కానీ వీరి కాంబినేషన్లో తప్పకుండా సినిమా వస్తే మాత్రం అద్భుతంగా ఉంటుంది అని ఫాన్స్ ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: