తాజాగా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై హత్యాయత్నం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.అయితే సైఫ్ అలీ ఖాన్ పై కత్తితో ఆరుసార్లు పొడిచిన వ్యక్తిని పోలీసులు అయితే పట్టుకున్నారు. అయితే ఈ పోలీసుల విచారణలో సంచలన విషయాలు బయటపడినట్లు తెలుస్తోంది. కేవలం సైఫ్ అలీ ఖాన్ కి మాత్రమే కాదు బాలీవుడ్ లో ఉండే మరో హీరో షారుఖ్ ఖాన్ కి కూడా ప్రాణహాని ఉంది అని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్టు బీటౌన్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి ఇంతకీ షారుక్ ఖాన్ కి ప్రాణహాని ఉంది అని వార్తలు రావడానికి కారణం ఏంటి.. నిజంగానే పోలీసులు షారుక్ ఖాన్ కి కూడా ప్రమాదం ఉందని తెలియ చేశారా అనే సంచలన విషయం ఇప్పుడు తెలుసుకుందాం.. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో ఆరుసార్లు పొడిచాడు. దీంతో సైఫ్ అలీ ఖాన్ తీవ్రంగా గాయపడ్డాడు. 

ఇక ఆయన కొడుకు లీలావతి హాస్పిటల్ కి చికిత్స నిమిత్తం సైఫ్ ని తరలించాడు.  ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ ఆరోగ్యం కాస్త నిలకడగానే ఉందని, ఆయన వెన్నెముకకు లోతుగా గాయం అవ్వడంతో ఏమైనా ఇన్ఫెక్షన్స్ వంటివి వచ్చే అవకాశం ఉంది అని డాక్టర్లు బయటపెట్టారు. అలాగే ఐసియూ నుండి స్పెషల్ రూమ్ లోకి కూడా సైఫ్ అలీ ఖాన్ ని మార్చుతున్నారట. అయితే కత్తితో దాడి చేసిన వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. ఆ వ్యక్తిని పోలీసులు విచారణ జరపగా ఆ వ్యక్తి గురించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ నటుడు  సైఫ్ అలీ ఖాన్ కి మాత్రమే కాదు షారుఖ్ ఖాన్ ఇంటి పైన కూడా ఆ దొంగ కన్నేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.. ఎందుకంటే సైఫ్ అలీ ఖాన్ పై హత్యకి పాల్పడ్డ వ్యక్తి షారుక్ ఖాన్ నివాసం అయినటువంటి మన్నత్ దగ్గర కూడా ఒక పెద్ద పొడవాటి నిచ్చెన వేసుకొని లోపల ఉండే పరిసరాలు అన్ని గమనించినట్టు షారుక్ ఖాన్ ఇంటి దగ్గర ఉండే సిసి టివి ఫుటేజ్ లో కనిపిస్తున్నట్టు పోలీసులు గుర్తించారట.

అంతేకాదు షారుఖ్ ఖాన్ నివాసం దగ్గర ఆ దొంగ చాలా సార్లు రెక్కీ నిర్వహించినట్టు తెలుస్తోంది. దీంతో పోలీసులు మరింత అలర్ట్ అయ్యి దొరికిన దొంగకు సంబంధించి ఇంకా ఎవరైనా దొంగలు ఉన్నారా.. ఈ వ్యక్తి ఒక్కడే అలాంటి పనులు చేస్తున్నాడా.. లేకపోతే ఈయన వెనుక ఏదైనా పెద్ద దొంగల ముఠా ఉందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే షారుక్ ఖాన్ కి కూడా ప్రాణ హాని ఉంది అంటూ వస్తున్న వార్తలపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. అయితే షారుక్ ఖాన్ కి కూడా ప్రాణహాని ఉంది అని సోషల్ మీడియాలో వినిపిస్తున్నవి ఫేక్ వార్తలా లేక నిజాలా అనేది తెలియాలంటే పోలీసులు అఫీషియల్ గా స్పందించాలని షారుఖ్ ఖాన్ అభిమానులు కోరుకుంటున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: