యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో మూవీ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ‘డ్రాగన్’ అనే టైటిల్ పెట్టాలని అనుకున్నారు. ప్రస్తుతానికి వర్కింగ్ టైటిల్ గా ఈ పేరు వినిపిస్తోంది. అఫీషియల్ గా ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. మేగ్జిమమ్ ఇదే టైటిల్ కన్ఫర్మ్ చేయోచ్చనే ప్రచారం నడుస్తోంది. మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఆసియా దేశాలని భయపెట్టిన మోస్ట్ వాంటెడ్ డాన్ కథతో ఈ మూవీ ఉంటుందని ఇండస్ట్రీలో ప్రచారం జరిగింది.ఇక త్వరలోనే  ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ సినిమాకి ‘డ్రాగన్’ టైటిల్ రిజిస్టర్ చేయించారో లేదో కాని సడెన్ గా తమిళంలో ఒక హీరో ఇదే పేరుతో ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ‘లవ్ టుడే’ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న ప్రదీప్ రంగనాథ్ కొత్త చిత్రంగా ‘డ్రాగన్’ మూవీని  తెరకెక్కబోతోంది.ఈ సందర్బంలోనే నేడు ఆయన కొత్త సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ని సంక్రాంతి సందర్భంగా విడుదల చేశాడు. కాలేజీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే ఈ సినిమాకి అస్వత్ మారి ముత్తు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రానికి ‘డ్రాగన్’ అనే టైటిల్ పెట్టారు. అంతటి పవర్ ఫుల్ టైటిల్ ని కాలేజీ బ్యాక్ డ్రాప్ సినిమా కోసం పెట్టావా..?, మా టైటిల్ ని దోచేశావు కదా అని ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియా లో ప్రదీప్ పై మండిపడుతున్నారు. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే సినిమాలకు ఎన్నో టైటిల్స్ ఉంటాయి, ఇలాంటివి అవసరం లేదు, మా టైటిల్ మాకు వెనక్కి ఇచ్చేయ్ అంటూ డిమాండ్ చేస్తున్నారు.మరి ప్రదీప్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కామెంట్స్ కి రెస్పాన్స్ ఇస్తాడా లేదా అనేది చూడాలి. ఈ క్రమంలో నే డ్రాగన్’ టైటిల్ ని ప్రదీప్ రంగనాథ్ కొట్టేయడంతో ఇప్పుడు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాకి ఏ పేరు పెడతారా అనే ఆసక్తి అందరిలో ఉంది. ఇంకేదైనా పవర్ ఫుల్ టైటిల్ ని ఆలోచిస్తారా లేదంటే అదే పేరు కోసం ప్రయత్నం చేస్తారా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: