లీలావతి ఆసుపత్రి వైద్యులు ప్రస్తుతం సైఫ్ ఐసీయూ నుంచి నార్మల్ గదికి తరలించినట్లు వెల్లడించారు.. సైఫ్ అలీ ఖాన్ ప్రస్తుతం అయితే బాగానే ఉన్నారని నిన్నటి రోజున ఉదయమే ఆయనకు ఆపరేషన్ చేసి వెన్నుముకలో ఉండే కత్తిని తొలగించామంటూ తెలిపారు. ఈరోజు ఆయన ఆరోగ్యం కాస్త కుదటగానే ఉందంటూ వైద్యులు తెలియజేశారు. అలాగే వెన్నుముకకు లోతైన గాయం అయింది కాబట్టే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. సైఫ్ అలీ ఖాన్ ఇప్పుడు నడవగలుగుతున్నారని తీవ్రమైన నొప్పి లేదా ఇతర ఇబ్బందులు తలెత్తుతాయనే విషయాన్ని గుర్తించలేమంటూ తెలిపారు.
ప్రస్తుతం ఆయనను ఐసీయూ నుంచి ప్రత్యేకమైన గదిలోకి మార్చామని అలాగే వెన్ను నుంచి కత్తి తొలగించి సర్జరీ చేయడం జరిగింది అంటూ తెలిపారు. సైఫ్ అలీఖాన్ శరీరం పైన ఆరు చోట్ల కత్తిపోట్లు ఉన్నట్టుగా వైద్యులు గుర్తించారట.. ఈ ఆరు గాయాలలో రెండు లోతుగా దిగాయని తెలిపారు.ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ పూర్తిగా క్షేమంగానే ఉన్నారని వైద్యులు తెలపడంతో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.. సైఫ్ అలీ ఖాన్ పైన వచ్చిన ఈ వార్త మొదట రూమర్స్ అనిపించినప్పటికీ కానీ ఈ విషయం నిజమైంది. సైఫ్ భార్య కరీనాకపూర్ కూడా తన భర్త ఆరోగ్య పరిస్థితి పైన వైద్యులను అడుగుతూ ఉన్నదట.