తాను ఒకటి తెలిస్తే దైవం మరొకటి తలచింది అన్నట్లు తయారైపోతుంది ఇండస్ట్రీలో పరిస్థితి . అసలు ఏ సినిమా హిట్ అవుతుంది ..? ఏ సినిమా ప్లాప్ అవుతుంది..? ఏ సినిమాకి ఎంత బడ్జెట్ పెట్టాలి? ఎలాంటి సినిమాలను తెరకెక్కిస్తే జనాలు చూస్తారు ..? ఏ సినిమా జనాలకి నచ్చుతుంది ..? అని గెస్ చేయడం చాలా చాలా ఇబ్బందికరంగా మారిపోతుంది.  అసలు డైరెక్టర్ లు అంచనా వేయలేకపోతున్నారు . కాగా రీసెంట్గా సంక్రాంతి కానుకగా బరిలో మూడు సినిమాలు దిగాయి . మూడు సినిమాలు కూడా పెద్ద హీరోలకి సంబంధించి కావడంతో ఇండస్ట్రీలో బాగా ఈ సంక్రాంతి హీట్ పెంచేసింది . అసలు ఏ హీరో నటించిన సినిమా హిట్ అవుతుంది..?? అంటూ చాలా చాలా ఈగర్ గా వెయిట్ చేసారు .

ఫైనల్లీ సంక్రాంతి కంప్లీట్ అయిపోయింది . కాగా సంక్రాంతి రియల్ విన్నర్ ఎవరో కూడా తెలిసిపోయింది . జనవరి 10వ తేదీ 'గేమ్ ఛేంజర్ ' సినిమా రిలీజ్ అయింది.  గ్లోబల్ హీరో రామ్ చరణ్ నటించిన ఈ సినిమా నెగిటివ్ టాక్ అందుకుంది . దానికి కారణాలు చాలా చాలానే ఉన్నాయి. అయితే సంక్రాంతి రేసులో అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది 'గేమ్ ఛేంజర్ ' మూవీ. ఆ తర్వాత రిలీజ్ అయిన 'డాకు మహారాజ్' సినిమా సూపర్ డూపర్ హిట్ అందుకుంది . బాలయ్య నటనకు తమన్  మ్యూజిక్ కి సూపర్ గా అట్రాక్ట్ అయిపోయారు జనాలు.  మంచి మార్కులే పడ్డాయి . అయితే 'డాకు మహారాజ్' సినిమా కంటే కూడా ఆ తర్వాత వచ్చిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా జనాలను బాగా ఆకట్టుకుంది .

'డాకు మహారాజ్' సినిమా ఓకే కానీ ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని బాగా నవ్వుకున్న సినిమా మాత్రం 'సంక్రాంతికి వస్తున్నాం'.  అనిల్ రావిపూడి కామెడీ అనే యాంగిల్ లో మ్యాజిక్ చేస్తూ సంక్రాంతికి ప్రతి ఇంట్లో నవ్వులు పూయించాడు. సినిమా కలెక్షన్స్ కూడా భారీ స్థాయిలోనే వచ్చాయి. అనిల్ రావిపూడి డైరెక్షన్ కు జనాలు ఫిదా అయిపోయారు.  మరీ ముఖ్యంగా కామెడీ టైమింగ్ వేరే లెవెల్ అంటూ పెద్ద పెద్ద స్టార్స్ కూడా ఓ రేంజ్ లో ప్రశంసించేశారు . అయితే 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా టాక్ అటు ఇటుగా ఉన్న కలెక్షన్స్ పరంగా ఒక్క స్టెప్ వెనకడుగు వేసిన 'డాకు మహారాజ్' సినిమా వేరే లెవెల్ లో ఉండేది . ఇప్పుడు 'డాకు మహారాజ్' సినిమా గురించి ఎవరు మాట్లాడుకోవడం లేదు.  నందమూరి అభిమానులు తప్పిస్తే. అందరూ కూడా 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు . దీంతో సినిమా హిట్ అయిన ఆ ఆనందమే లేకుండా పోయింది డైరెక్టర్ బాబీకి అంటూ జనాలు ట్రోలింగ్ కూడా స్టార్ట్ చేశారు. కొంత మమది సామెతలతో ఆడేసుకుంటున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: