నందమూరి బాలకృష్ణ ..చాలామంది ముద్దుగా బాలయ్య అంటూ పిలుస్తూ ఉంటారు . కొంతమంది 'బాల' అని కూడా అంటూ ఉంటారు . అయితే చాలామంది మాత్రం బాలయ్య.. బాలయ్య అంటూ తమ ఇంట్లో మనిషిని పిలిచినట్లు ప్రేమగా ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటారు. అఫ్కోర్స్ బాలయ్యకు కోపం ఎక్కువ. ఆ విషయం అందరికీ తెలుసు. బాలయ్య ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతాడు . ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే ఈ లోకంలో ప్రజెంట్ జనరేషన్ కి మరి కోపం . అయితే బాలయ్య మాత్రం అస్సలు తగ్గేదేలే అన్నట్టు తాను నమ్మిన విషయాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు.
మరి ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో బాలయ్య ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరమే లేదు . చాలామంది స్టార్ హీరోల ఫ్యాన్స్ బాలయ్యను లైక్ చేస్తూ ఉంటారు . కొంతమంది బాలయ్యకు దూకుడు ఎక్కువ అని అంటున్న కూడా బాలయ్య మంచితనాన్ని తెలుసుకొని బాలయ్య రియల్ హీరో ఈ వయసులోనూ ఇండస్ట్రీని ఏలేస్తున్నాడు అంటూ నాటి నాటి కామెంట్స్ కూడా చేస్తూ ఉంటారు . తాజాగా బాలయ్యకు సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. రీసెంట్గా అన్ స్టాపబుల్ షోలో బాలయ్య అభిమానులందరికీ ఓ విషయాన్ని కన్ఫామ్ చేశారు .
చాలామంది హీరోలు ఈ మధ్యకాలంలో మల్టీ స్టారర్ల సినిమాలో నటిస్తున్నారు. అయితే బాలయ్య కి ఆ ఛాన్స్ వస్తే ఏ హీరోతో నటిస్తాడు..? అని తెలుసుకోవాలి అంటూ చాలామంది ఫ్యాన్స్ వెయిట్ చేశారు. పరోక్షకంగా డైరెక్టర్ బాబీ ఆ విషయాన్నీ బయటపెట్టించేశాడు . 'డాకు మహారాజు' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అన్ స్టాపబుల్ షో కి వచ్చిన బాలయ్యను ప్రశ్నిస్తూ.." మీరు ఏ హీరోతో మల్టీ స్టారర్ సినిమాలో నటించాలి అని అనుకుంటున్నారు..? చిరంజీవి - నాగార్జున - వెంకటేష్" అంటూ అడగ్గ.. బాలయ్య వెంటనే చిరంజీవి అంటూ ఆన్సర్ ఇస్తాడు. దీంతో అక్కడ జనాలు అరుపులు కేకలతో హోరెత్తిస్తారు. చాలామంది జనాలకు బాలయ్య - చిరంజీవి కాంబోలో సినిమా రావాలి అంటూ ఆశపడ్డారు .
కాగా ఈ మాటలను అనిల్ రావిపూడి బాగా గట్టిగా విన్నట్లు ఉన్నాడు . అందుకే బాలయ్య - చిరంజీవిల కాంబోలో ఓ సినిమాని ప్లాన్ చేస్తున్నారట. ఇన్సైడ్ వర్గాలనుంచి అందుతున్న సమాచారం ప్రకారం సంక్రాంతికి వస్తున్నాం సినిమా సక్సెస్ మీట్ తర్వాత చిరంజీవిని డైరెక్ట్ చేయబోతున్నాడు అనిల్ రావిపూడి అంటూ టాక్ వినిపిస్తుంది. అయితే అనిల్ రావిపూడి తెరకెక్కించే సినిమాలో చిరంజీవి మాత్రమే కాదు అని.. భగవంత్ కేసరి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బాలయ్యను కూడా అందులో భాగం చేయబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే వార్త బాగా ట్రెండ్ అవుతుంది..!