ప్రస్తుతం సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా సైఫ్ అలీ ఖాన్ కి సంబంధించిన వార్తలే చక్కర్లు కొడుతున్నాయి. ఎప్పుడైతే సైఫ్ అలీ ఖాన్ పై గుర్తుతెలియని వ్యక్తి కత్తితో పొడిచి హత్యా ప్రయత్నం చేసాడో అప్పటినుండి సైఫ్ కి సంబంధించిన చాలా విషయాలు మీడియాలో వైరల్ అవుతున్నాయి  అయితే సైఫ్ అలీ ఖాన్ ఇంటికి ఆ వ్యక్తి దొంగతనానికి వచ్చినట్టు తెలుస్తోంది. కోటి రూపాయలు ఇవ్వలేదనే కోపంతో ఆరుసార్లు కత్తితో పొడిచినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. అలాగే ప్రస్తుతం సైఫ్ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు తెలుస్తుంది.ఈ విషయం పక్కనపెడితే ఈయనపై హత్యాయత్నం జరగడంతో ప్రస్తుతం సైఫ్ కి సంబంధించిన ఎన్నో విషయాలు మీడియాలో వైరల్ అవుతున్నాయి  అయితే సైఫ్ అలీ ఖాన్ రెండు పెళ్లిళ్లు చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. 21 ఏళ్లలోనే సైఫ్ మొదటి పెళ్లి చేసుకున్నారు. 

ఎంతో మంది హీరోలు 30, 40 దాటిన పెళ్లి చేసుకోరు. కానీ యంగ్ ఏజ్ లోనే సైఫ్ అలీ ఖాన్ తనకంటే వయసులో 12 ఏళ్ళు పెద్దదైన అమృత సింగ్ ని పెళ్లి చేసుకున్నారు. వీరికి సారా అలీ ఖాన్, ఇబ్రహీం అలీ ఖాన్ అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే 13 ఏళ్లు సాఫీగా సాగిన వీరి సంసారంలో అనుకోని కారణాలవల్ల గొడవలు వచ్చి ఇద్దరు 2005లో విడాకులు తీసుకున్నారు.అయితే తనకంటే వయసులో పెద్దదైన అమృతని సైఫ్ అలీ ఖాన్ పెళ్లి చేసుకోవడం వెనుక ఉన్న కారణమేంటి అని చాలామంది ఆసక్తిగా ఉంటారు. అయితే వీరిద్దరి మధ్య ప్రేమ ఫస్ట్ టైం కలుసుకున్న సమయంలోనే కలిగిందట. అలా ప్రేమకి వయసుతో సంబంధం లేదు అన్నట్లు మొదట డిన్నర్ డేట్ కి వెళ్లి ఆ డిన్నర్ డేట్ లోనే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యారట.

అలా ఇరుకుటుంబ సభ్యులను ఒప్పించి వీరిద్దరూ 1991 లో పెళ్లి చేసుకున్నారు.అలా ఇద్దరు పిల్లలు పుట్టాక విడాకులు తీసుకున్నారు  అయితే సైఫ్ ని పెళ్లి చేసుకునే కంటే ముందే బాలీవుడ్లో అమృతా సింగ్ స్టార్ హీరోయిన్. ఇక విడాకుల తర్వాత అమృతా సింగ్ భరణం గా సైఫ్ నుండి 5 కోట్లు డిమాండ్ చేసిందట. మొదట 2.5 కోట్లు చెల్లించిన సైఫ్ ఆ తర్వాత మిగతా మొత్తాన్ని కూడా ఇచ్చారట. అలాగే తన ఇద్దరు పిల్లల సంరక్షణ కోసం కూడా నెలకు లక్ష రూపాయలు ఇచ్చేవారట. అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట మధ్య ఎందుకు గొడవలు వచ్చాయో చెప్పమని ఓ ఇంటర్వ్యూలో అమృతా సింగ్ కి ప్రశ్న ఎదురవగా.. పెళ్లి మా ప్రైవేటు మ్యాటర్.. దాని గురించి పబ్లిక్ గా చెప్పాలనుకోవడం లేదు అంటూ అమృతా సింగ్ చెప్పింది. కానీ వీరి మధ్య గొడవలు రావడానికి కారణం కరీనా కపూర్ అని బీ టౌన్ లో టాక్..

మరింత సమాచారం తెలుసుకోండి: