పద్మనాభం.. ఒకప్పటి హాస్య నటుడు. తర్వాత .. ఆయన కూడా సినిమాలు చేశారు. తీశారు.. నిర్మాతగా, దర్శకుడిగా కూడా పేరు తెచ్చుకున్నారు. అయితే.. పద్మనాభం సినిమాల ప్రవేశం చిత్రంగా జరిగింది. కడప జిల్లా పులివెందులకే చెందిన పద్మనాభం.. పదో తరగతి వరకు చదువుకున్నారు. చాలా కష్టాలుపడి అప్పటి వరకు లాక్కొచ్చారు. చిన్నవయసులోనే కుటుంబం బాధ్యతలను మోయాల్సి వచ్చింది.
దీంతో పదో తరగతిని మధ్యలోనే మానేయాలని అనుకున్నా.. ఉపాధ్యాయుల సూచనతో దానిని కొనసా గించారు. తర్వాత.. ఓ కొట్లో గుమాస్తాగా చేశారు. నెలకు అప్పట్లో రూపాయి జీతం ఇచ్చేవారు. దీంతోనే ఇల్లు మొత్తం గడవాలి. ఈ క్రమంలో ఒకసారి కొట్టుకువ చ్చిన జమీందార్.. నాతో వస్తావా.. అంటూ.. తన వెంట తీసుకువెళ్లారు. ఆయనది మద్రాసు. అక్కడ తన హోటళ్లలో బిల్లులు రాసే ఉద్యోగం ఇచ్చారు.
నెలకు 2 రూపాయల జీతం. వసతి కల్పించారు. ఇలా ప్రారంభమైన పద్మనాభం అనే కుర్రాడి జీవితం.. అనూహ్యంగా మలుపు తిరిగింది. ఈ హోటల్ వచ్చిన.. గోవింద రాజుల సుబ్బారావుకు పద్మనాభం బాగా నచ్చేశాడు. ఏం కుర్రాడా.. సినిమాల్లో నటిస్తావా? అని అడిగారు. కానీ, డబ్బుల గురించి బెంగ పెట్టుకున్న పద్మనాభం.. సమాధానం చెప్పలేదు.
తర్వాత.. కొన్నాళ్లకు.. తనే స్వయంగా సుబ్బారావును వెతుక్కుంటూ.. టీ నగర్ వెళ్లి.. కలిసారు. ఇలా.. ఆయనకు తొలి ప్రయత్నంగా.. షావుకారు సినిమాలో.. ఇంటి పనిమనిషిగా వేషం ఇచ్చారు. క్యారెక్టర్ పేరు పోలాయ్.. ఈ పాత్రలో అన్నగారు ఎన్టీఆర్, జానకిలు.. అనేక సందర్భాల్లో వెధవాయ్ అని తిడతారు. ఒక్కసారి ఈ సినిమా చూస్తే.. ఈనేనా పద్మనాభం అని అనిపించేలా ఉంటుంది. అలా మొదలైన పద్మనాభం సినిమాల ప్రస్థానం అక్కడితో ఆగలేదు. తిరుగులని బిజీ ఆర్టస్టు అయిపోయాడు. ఆ తర్వాత ఆయన విలాస వంతమైన జీవితం ఎంజాయ్ చేయడం తో పాటు కొందరు అమ్మాయిలతో ఎఫైర్లు నడిపాడన్న పుకార్లు ఉన్నాయి. అలా ఆయన కెరీర్ పతనమైంది.