ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకుంది. కలెక్షన్స్ పరంగా కూడా మంచి రికార్డ్స్ క్రియేట్ చేసింది . అయితే 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా 'డాకు మహారాజ్' సినిమాని ఎంజాయ్ చేయకుండా చేసేసింది. ఇప్పుడు ఏ ఇంట్లో చూసినా సరే 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాకి సంబంధించిన మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి . కాగా ఇదే మూమెంట్లో డైరెక్టర్ బాబీకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బాగా ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు . "పవర్" సినిమాతో దర్శకుడుగా పవర్ ఫుల్ ఎంట్రీ ఇచ్చిన బాబి .. ఆ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత ఇండస్ట్రీలో తన పేరును మారుప్రోగిపోయేలా కొన్ని సినిమాలను డైరెక్ట్ చేస్తూ ..తనలోని రచయితను బయట పెట్టాడు.
కాగా బాబీ డైరెక్టర్ కాకముందు ఓ సినిమాలో హీరోకి ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటించాల్సి ఉండింది . ఆ సినిమా మరి ఏదో కాదు బన్నీ డెబ్యూ ఇచ్చిన "గంగోత్రి" మూవీ . రాఘవేంద్రరావు గారు 'గంగోత్రి' సినిమాను డైరెక్టర్ చేశారు . గంగోత్రి సినిమాలో అల్లు అర్జున్ పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్ కోసం బాబీ సెలెక్ట్ అయ్యాడు . అయితే నిక్కర్ వేసుకోవాలి అని రాఘవేంద్రరావు గారు టైలర్ ని పిలిపించి అసిస్టెంట్ దగ్గర కొలతలు తీయిచుకుంటున్న మూమెంట్లో 'నేను నిక్కర్ వేసుకుని నటించను.. గుంటూరులో నా పరువు పోతుంది' అంటూ భయపడి ఆ సినిమానే చేయలేదట . ఈ విషయం ఓ ఇంటర్వ్యూలో బయటపడ్డింది. బాబీ తెరకెక్కించిన 'వాల్తేరు వీరయ్య ' సినిమా 100 కోట్లు కలెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ రోజు నిక్కర్ వేసుకోవడానికి భయపడ్డ బాబి.. ఈరోజు ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్ గా నిలిచాడు అంటూ బాబి ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఆయన ధైర్యాన్ని పొగిడేస్తూ ప్రశంసిస్తున్నారు..!