అయితే తెలుగు ఇండస్ట్రీలో సగానికి మందికి పైగా మెగా హీరోలే ఉన్నారు అన్న విషయం అందరికీ తెలిసిందే . వాళ్ళందరు తోపైన హీరోలా..? అంటే కాదు అనే చెప్పాలి . కొందరు అసలు మూడు హిట్ కూడా కొట్టకుండా అల్లాడిపోతున్నారు. మరి ముఖ్యంగా వరుణ్ తేజ్ లాంటి మెగా హీరో ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ఇంకా కష్టపడుతున్నాడు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కాగా రీసెంట్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన సినిమా ఎలా నెగటివ్ టాక్ అందుకుందో అందరికీ తెలిసిందే . అయితే "గేమ్ చేంజర్ ' సినిమా విషయంలో తప్పంతా కూడా డైరెక్టర్ శంకర్ దే అంటూ చాలామంది జనాలు మాట్లాడుకుంటూ వచ్చారు .
కానీ ఎప్పుడు మెగా ఫ్యామిలీని హేట్ట్ చేసే జనాలు మాత్రం రామ్ చరణ్ ఈ సినిమా విషయంలో తీసుకున్న డెసిషన్ రాంగ్ అయింది అని .. ఒక గ్లోబల్ స్థాయి ఇమేజ్ ఉన్న హీరో ఇలా డైరెక్టర్ చెప్పిన ప్రతి సీన్ కి తల ఊపి చేసేస్తాడా..? అని .. డైరెక్టర్ మంచి మంచి సీన్స్ సినిమాలో నుంచి లేపేస్తూ ఉంటే సినిమా ఫ్లాప్ అయితే ఫ్యాన్స్ హర్ట్ అవుతారా..? అన్న సంగతి చరణ్ కి తెలియదా అంటూ ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు . అంతేకాదు చరణ్ పై దారుణంగా నెగటివ్ కామెంట్స్ కూడా చేశారు . కొందరు అసలు చరణ్ కి గ్లోబల్ స్టార్ అన్న ఇమేజ్ తీసేయాలి అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఓ పాన్ ఇండియా హీరోకి ఇలాంటి సిచ్యువేషన్ ఎదురవ్వడం ఫ్యాన్స్ కి హర్ట్టింగా అనిపిస్తుంది. చూడాలి మరి చరణ్ ఈ నెగిటివ్ టాక్ నుంచి ఎలా బయట పడతాడో...???