పాపం.. రామ్ చరణ్ ఏ ముహూర్తాన గేమ్ ఛేంజర్ సినిమాని ఓకే చేశాడో..? ఏ ముహూర్తాన గేమ్ ఛేంజర్ సినిమాని సెట్స్ పైకి తీసుకొచ్చాడో..? ఏ ముహూర్తాన సినిమా ప్రమోషన్స్ కి వెళ్ళాలి అని డిసైడ్ అయ్యాడో..? అసలు సినిమా అగ్రిమెంట్ పై సైన్ చేసాడో..? పాపం అప్పటినుంచి చరణ్ కు ప్రతి ఒక్కటి కూడా నెగిటివ్ గానే మారిపోతూ వస్తుంది . రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్  పై సోషల్ మీడియాలో ఎలాంటి ట్రోలింగ్ జరుగుతుందో మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా డైరెక్టర్ శంకర్ దే తప్పు అని అంతా అంటున్నా.. మళ్లీ రాంచరణ్ పై నింద వేయడానికి కాచుకొని కూర్చుంది ఒక సర్ టైన్ బ్యాచ్ . అయితే సోషల్ మీడియాలో రామ్ చరణ్ పేరు పై హ్యూజ్ ట్రోల్లింగ్ జరుగుతూ ఉండడంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ బాగా డీప్ గా హార్ట్ అవుతున్నారు.

కాగా ఇప్పుడు మెగా హీరో చరణ్ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు మెగా కాంపౌండ్ నుంచి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . అయితే గతంలో రాంచరణ్ ఇద్దరు డైరెక్టర్ల కారణంగా కూడా ఇదే విధంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురయ్యారు . ఆ ఇద్దరు డైరెక్టర్ లని బ్యాన్ చేసి పడేసాడు అని..ఇప్పుడు శంకర్ ని కూడా అదే విధంగా బ్యాన్ చేసి పడేశాడు అంటూ ఓ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. ఇక ఆయనతో సినిమాలను ఓకే చేయరు అంటూ మెగా ఫ్యాన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు.

గతంలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన 'వినయ విధేయ రామ' సినిమా టైంలో కూడా చరణ్ పై ఇదే ట్రోలింగ్ జరిగింది . ఆ తర్వాత బోయపాటితో సినిమా ఊసే ఎత్తలేదు రామ్ చరణ్ . ఆ తర్వాత 'ఆచార్య ' సినిమా టైంలోనూ ఇదే ట్రోలింగ్ ఎక్కువగా జరిగింది . అసలు మెగా హీరోస్ కి ఏమైంది..? బ్రెయిన్ లేదా ..? అన్న కామెంట్స్ కూడా వినిపించాయి.  దీంతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ..కొరటాల శివని కూడా బ్యాన్ చేసేసాడు . ఇప్పుడు శంకర్ కారణంగా మళ్ళీ అదే ట్రోలింగ్ జరుగుతుంది . దీనితో శంకర్ ని కూడా ఇక మెగా ఫ్యామిలీ బ్యాన్ చేసేసింది అని .. ఆ డైరెక్టర్ తో ఇక మెగా హీరోలు ఎవరు సినిమా చేయరు అని .. ఇండస్ట్రీలో ఓ వార్త బాగా ట్రెండ్ అవుతుంది. దీంతో ఆ ముగ్గురు డైరెక్టర్లు పై మెగా హీరోలు అందరూ కూడా బ్యాన్ విధించేశారు మెగా ఫ్యామిలీ అంటూ ..ఇక మెగా కాంపౌండ్ లోకి ఇక ఆ ముగ్గురు డైరెక్టర్లు అడుగు కూడా పెట్టలేరు అంటూ ఘాటు ఘాటుగా ట్రోల్ చేస్తున్నారు..!
 

మరింత సమాచారం తెలుసుకోండి: