మంచు మోహన్ బాబు నటించిన రౌడీ సినిమాలోని 'సింహం అవ్వాలి అని ప్రతి కుక్కకి ఉంటుంది. కానీ వీధిలో మొరగడానికి అడవిలో గర్జించడానికి ఉన్న తేడా కనీసం వచ్చే జన్మలో అయినా తెలుసుకుంటావన్న ఆశ' అనే డైలాగ్ ని పోస్ట్ చేశాడు. దాని కింద ఆ డైలాగ్ తన ఫేవరెట్ అని రాసుకొచ్చారు. ఇక ఈ పోస్ట్ మళ్లీ దేనికి దారి తీస్తోందో అని ప్రేక్షకులలో చర్చలు జరుగుతున్నాయి.
ఇక మంచు విష్ణు ఒక భారతీయ నటుడు మరియు చలనచిత్ర నిర్మాత . మంచు రగిలే గుండెలు చిత్రంతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించారు. ఆ తర్వాత అతను 2003 తెలుగు యాక్షన్ చిత్రం విష్ణులో నటించాడు. ఆ సినిమాకు గాను అతను ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ పురుష అరంగేట్రం గెలుచుకున్నాడు. ప్రస్తుతం 2021 నుంచి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. మంచు విష్ణు తెలుగు సినిమాలో చేస్తూ తన కెరీర్‌ను స్థాపించాడు. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ తెలుగు వారియర్స్ స్పాన్సర్‌లలో మంచు విష్ణు ఒకరు. ఈయన వైఎస్ రాజశేఖర రెడ్డి మేనకోడలు విరానికా రెడ్డిని వివాహం చేసుకున్నాడు. 2011లో వీరికి కవల కుమార్తెలు కలిగారు. జనవరి 2018లో, వారికి ఒక కుమారుడు మరియు ఆగస్టు 2019లో ఒక కుమార్తెకి జన్మ ఇచ్చారు.