ఇక, ఆత్రేయ కూడా.. అనేక కవితలు, నాటకాలు రాశారు. ఆయన రాసిన కవితలు.. నాటకాలు ఇప్పటికీ సూపర్ హిట్టే కావడం గమనార్హం. అశోకుడు.. నాటిక వేలాది సార్లు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నటించారం టే.. చాలా మందికి తెలియదు. అయితే.. వీరు మళ్లీ సినిమాలకు కూడా పాటలు రాశారు. మహాకవి బిరుదు రాకపోయినా.. అంతటి స్థాయి ఉన్న కవి.. సి. నారాయణ రెడ్డి. ఈయన కూడా అనేక కవితలు రాశారు. జ్ఞానపీఠ్ అవార్డు కూడా అందుకున్నారు.
ఇక్కడ విషయం ఏంటంటే.. సినిమా రంగంలోకి వచ్చేసరికి.. వీరి కవితలకు ప్రాధాన్యం దక్కలేదు. పాటలు రాయించుకున్నారే తప్ప.. ఆయా కవులు రాసిన కవితలకు నిర్మాతలు, దర్శకులు తమ తమ సినిమాల్లో ప్రాధాన్యం ఇవ్వలేదు. కానీ, ఈ గౌరవం మాత్రం ఒకే ఒక్క కవి.. మహాకవిగా పేరొందిన శ్రీశ్రీకే దక్కింది. ఆయన ఏం రాసినా.. ముద్రించేందుకు పత్రికలు.. ఆయన చేతి కలం నుంచి ఏం జాలువారినా.. సినిమాల్లో పెట్టుకునేందుకు నిర్మాతలు క్యూ కట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయి.
ముఖ్యంగా బాలచందర్ .. తీసిన అనేక సినిమాల్లో మహాకవి శ్రీశ్రీ కవితలే పాటలయ్యాయి. ఆకలి రాజ్యం సినిమాలో ప్రతి డైలాగులోనూ మహాకవి శ్రీశ్రీ ఫైర్ మనకు కనిపిస్తుంది. అదేసమయంలో ఆయన రాసుకున్న ఎంత కష్టం.. ఎంతకష్టం.. అనే కవితా సంపుటిని పాటగా మార్చేశారు. అదేవిధంగా కన్యాశుల్కం నాటకంలోనూ శ్రీశ్రీరాసుకున్న కవితను ఏకంగా సావిత్ర డ్యాన్సుతో కలిపి పాటగా మలిచారు. ఇక, శ్రీశ్రీ రాసిన అనేక పాటలు సినిమాల్లో సూపర్ హిట్ సాధించాయి. అయితే.. శ్రీశ్రీ రాసిన ఏ మాట.. కూడా వృథా కాలేదు.