డాన్సింగ్ క్వీన్ శ్రీలీల వరుస సినిమాలతో ప్రేక్షకులని అలరిస్తూ దూసుకు పోతోంది. ఇటీవల ఆమె అల్లు అర్జున్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ సినిమా పుష్ప 2 లో దెబ్బలు పడతాయరా .. దెబ్బలు పడతాయ్ రా అన్న ఐటెం సాంగ్ లు కిస్సిక్ అంటూ చేసిన హాట్ డ్యాన్సులు .. హాట్ కవ్వింపులు .. హాట్ లుక్స్ ఏ స్థాయిలో దేశ వ్యాప్తంగా వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కిస్సిక్ కిస్సిక్ అంటూ శ్రీలీల చేసిన డ్యాన్సులు.. ఆ స్టెప్పులు మామూలుగా కవ్వించ లేదు మన ఇండియన్ కుర్ర కారుని.. !
ఇదిలా ఉంటే శ్రీలీల టాలీవుడ్ లో వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ దూసుకు పోతోంది. గతేడాది శ్రీలీల మహేష్ బాబు తో గుంటూరు కారం సినిమా చేసినా ఈ సినిమా ఆమె కెరీర్ కు అనుకున్నంత హెల్ప్ అయితే కాలేదు. అంతకు ముందు యేడాది శ్రీలీల వరుస పెట్టి ఐదారు సినిమాలు చేసినా అవేవి సక్సెస్ కాలేదు. అయితే ఈ యేడాది ఆమె కెరీర్ కు పుష్ప 2 లో ఐటెం సాంగ్ మినహా పెద్ద గా కలిసి రాలేదు.
ఇదిలా ఉంటే శ్రీలీల ఒక స్నేహితుడితో రిలేషన్లో ఉందని టాక్ నడిచినా ఆ పుకార్లను కొట్టి పారేసింది.ఒక పక్క చదువుతూనే నటనపై దృష్టి పెట్టింది శ్రీలీల .. అలాగే త్వరలోనే చదువు పూర్తి చేసి సినిమాలపై మరింతగా కాన్‌సంట్రేషన్ చేస్తానని శ్రీలీల తెలిపింది. ఆమె ప్రస్తుతం MBBS చదువుతుంది. తనకు చదువు తో పాటు నటన తప్ప వేరే ఆలోచన లేదని .. తాను MS డిగ్రీ పూర్తి చేయాలను కుంటున్నట్టు కూడా తెలిపింది. శ్రీలీల తల్లి కూడా డాక్టరే... ఆమే పేరు స్వర్ణలత.. ఆమె కర్ణాటకలో ప్రఖ్యాత గైనకాలజిస్ట్ మరియు ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ గా ఉన్నారు. ఇక డాక్టర్ స్వర్ణలత ఎంతో మందికి కన్నడ సినీ తారలకు పెర్సనల్ డాక్టర్ గా ఉన్నారు