హీరో నాగచైతన్య, హీరోయిన్ సాయిపల్లవి జోడీగా నటించిన తండేల్ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో లవ్‌స్టోరీ ఉంటుంది. ఈ సినిమాకు దర్శకుడు చందు మొండేటి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో రాజు అనే జాలరి పాత్రలో నాగచైతన్య, సత్య పాత్రలో సాయిపల్లవి నటించారు. ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించారు. ఇక ఈ చిత్రం ఫిబ్రవరి 7న విడుదల కానుంది. అలాగే హీరో సాయిరామ్ శంకర్ ఒక పథకం ప్రకారం అనే టైటిల్ తో ఫిబ్రవరిలో థియేటర్స్‌లోకి వచ్చి దుమ్ము లేపానున్నాడు. ఈ మూవీని గార్లపాటి రమేష్‌తో కలిసి నిర్మాత వినోద్ కుమార్ విజయన్ నిర్మించారు. శ్రుతీ సోధి, ఆషిమా నర్వాల్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 1న రిలీజ్‌కు సిద్ధం అవుతోంది.
యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన యూత్ ఫుల్ లవ్‌స్టోరీ మూవీ ‘లైలా’ ఫిబ్రవరి 14న రిలీజ్ కానుంది. రామ్ నారాయణ్ డైరెక్షన్‌లో సాహు గారపాటి ఈ మూవీని నిర్మించారు. ఆకాంక్షా శర్మ హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు. ఇక మరో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం లవర్స్ డే రోజున దిల్ రూబా అనే లవ్ మూవీతో థియేటర్స్‌లోకి వస్తున్నారు. విశ్వ కరుణ్ దర్శకత్వంలో రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సారెగమ ఈ మూవీని నిర్మించారు. రుక్సార్ థిల్లాన్ హీరోయిన్‌గా నటించింది. అలాగే దర్శకుడు వేణు ఊడుగుల నిర్మాతగా మారి, మరో నిర్మాత రాహుల్ మోపిదేవితో కలిసి రాజు వెడ్స్ రాంబాయి అనే తెలంగాణ గ్రామీణ ప్రేమకథ తీశారు. అలాగే ప్రముఖ సీనియర్ నటుడు బ్రహ్మానందం 'బ్రహ్మా ఆనందం' సినిమాతో, నటుడు ధన్‌రాజ్ 'రామం రాఘవం', సందీప్ కిషన్ 'మజాకా' సినిమాతో తెరపైకి రానున్నారు.