ఆయన ప్రయాణం నిజంగా అందరికీ ఇన్స్పిరేషన్ చాలా కష్టపడి పైకి ఎదిగాడు. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించాల్సి ఉంది . కానీ అవి కొన్ని కారణాల చేత పెద్ద హీరోలకి వెళ్లిపోయాయట . సందీప్ కిషన్ తన కెరియర్ ని స్నేహగీతం అనే సినిమా ద్వారా ప్రారంభించాడు. కాగా నెగిటివ్ రోల్ లో ఆకట్టుకున్నప్పటికీ ఆ తర్వాత పాజిటివ్ గా మారే ఛాన్సెస్ కోసం ఎదురు చూశాడు . 'వెంకటాద్రి ఎక్స్ప్రెస్' సినిమాతో ఫస్ట్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు .
కాగా సందీప్ కిషన్ ఖాతాలోకి వచ్చినట్లే వచ్చి రెండు సినిమాలు మిస్ అయిపోయాయట . ఆ రెండు కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ కావడం గమనార్హం. త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన నాని నటించిన "నేను లోకల్ " సినిమాలో మొదటిగా హీరోగా సందీప్ కిషన్ నే అనుకున్నారట . ఆ తర్వాత రామ్ హీరోగా నటించిన 'హలో గురు ప్రేమకోసమే' సినిమాలో కూడా ఆయనకు అవకాశం వచ్చిందట . కానీ అవి సడన్గా వేరే వాళ్ళకి షిఫ్ట్ అయిపోయాయట . ఈ రెండు సినిమాలు కాని సందీప్ కిషన్ ఖాతాలో పడి ఉంటే మాత్రం ఆయన కెరియర్ వేరే లెవెల్ లో ఉండేది . నో డౌట్ కచ్చితంగా పాన్ ఇండియా స్థాయిలోనే బన్నీ లెవల్ లో ఫాన్ ఫాలోయింగ్ సంపాదించుకునే వాడు అంటున్నారు సందీప్ కిషన్ అభిమానులు . తాజాగా ఆయన నటిస్తున్న సినిమా 'మజాకా'. ఈ సినిమాతో ఆయన హిట్టు అందుకుంటాడు అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు . చూద్దాం మరి ఏం జరుగుతుందో..??