తెలుగు దిగ్గజ కమెడియన్ బ్రహ్మానందం కొన్నేళ్లుగా సినిమాలు తగ్గించేశాడు . ఆ విషయం మనందరికీ తెలుసు . ఒకప్పుడు జెట్ స్పీడులో పాన్ ఇండియా హీరోల కంటే ఫాస్ట్ గా సినిమాలను ఓకే చేసేవాడు కానీ , ఇప్పుడు మాత్రం పరిస్థితి అలా లేదు . అయితే ఆయనకు అవకాశాలు రాక కాదు.. ఆయనకు అవకాశాలు వస్తున్నా కూడా ఆయన సినిమాలను తగ్గించుకున్నాడు . ఈ విషయాన్ని స్వయాన బ్రహ్మానందమే ఓపెన్ గా చెప్పుకొచ్చాడు . తాజాగా 'బ్రహ్మ ఆనందం' సినిమా ఈవెంట్లో పాల్గొన్నారు .
ఈ క్రమంలోనే .."తాను సినిమాలు తగ్గించలేదు అని తాను సినిమాలల్లో నటించడం తగ్గించుకున్నాను అని .. ఒకప్పుడు సూపర్ గా కామెడీ చేసే ఆయన ఏంటి ఇలా చేస్తున్నాడు అన్న మాటలు నా చెవిన పడ్డాయి అని .. అందుకే నేను సినిమాలలో ఎక్కువగా నటించడం లేదు " అంటూ చెప్పుకొచ్చాడు . అంతేకాదు నా వారసత్వాన్ని కమెడియన్ వెన్నెల కిషోర్ కొనసాగిస్తాడు అని .. ఆయన చాలా చాలా బాగా నవ్విస్తాడు అని ..చెప్పుకొచ్చాడు . అంతేకాదు చాలామంది బ్రహ్మానందం మాటలను సపోర్ట్ చేస్తున్నారు . నిజమే వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్ బాగుంటుంది అంటూ పొగిడేస్తున్నారు . అయితే ఇక బ్రహ్మానందం ప్లేస్ ను ఇండస్ట్రీలో రీప్లేస్ చేయాలి అంటే మాత్రం అది కచ్చితంగా వెన్నెల కిషోర్ అని ఫిక్స్ అయిపోయారు జనాలు..!