ఒకరు స్టార్ నటుడు కుమారుడు అయితే మరొకరు స్టార్ట్ డైరెక్టర్ కొడుకు. ఇద్దరు కూడా తమ తండ్రుల వారసత్వాన్ని ముందుకు తీసుకెళుతున్నారు. ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్టులుగా రంగ ప్రవేశం చేసి చిన్నతనంలోనే తమ నటనకు శభాష్ అంటూ కామెంట్స్ కూడా దక్కించుకున్నారు. లెక్కలేనంత మంది ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా దక్కించుకున్నారు . మరి ఈ కుర్రాళ్ళు ఎవరో గుర్తుపట్టారా..? సరే మీ కోసం మేమే చెప్పేస్తున్నాం. ఇక్కడ మీరు చూస్తున్న హీరోలలో ఒకరు కోలీవుడ్ స్టార్ హీరో శింబు.. మరొకరు అరుణ్ విజయ్.
విజయ్ ప్రముఖ నటుడు విజయ్ కుమార్ కుమారుడే ఈ అరుణ్ విజయ్ . తమిళంలో పలు సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితుడు అయ్యాడు . రామ్ చరణ్ నటించిన బ్రూస్ లీ అదేవిధంగా ప్రభాస్ నటించిన సాహులల్లో కీలకపాత్రలో మెరిసారు. కాగా శింబు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అందరికీ తెలిసిన వాడే . ఆయన నటించిన సినిమాలు ఎంత హిట్ అయ్యాయో అంతకన్నా ఆయన లవ్ స్టోరీలు బాగా హిట్ అయ్యాయి. ఈ ఇద్దరు కూడా మంచి స్నేహితులు . ఇప్పటికీ మంచి స్నేహితులుగానే కొనసాగుతున్నారు. వీళ్ళకి సంబంధించిన ఈ రేర్ పిక్చర్ ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ గా మారింది..!