యంగ్ హీరో విశ్వక్‌ సేన్‌ నటించిన యూత్‌ ఫుల్‌ లవ్‌స్టోరీ లైలా మూవీ ప్రేక్షకుల ముందుకి రానుంది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా  ఫిబ్రవరి 14న రిలీజ్‌ కానుంది. ఈ చిత్రంలో మోడల్‌ సోనూగా, అమ్మాయి లైలాగా డిఫరెంట్‌ వేరియేషన్స్‌ ఉన్న రోల్స్‌లో విశ్వక్‌ సేన్‌ నటిస్తున్నాడు. ఈ సినిమా రామ్‌ నారాయణ్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతుంది. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి ఈ మూవీని నిర్మించారు. ఈ సినిమాలో విశ్వక్ సేన్ కి జోడీగా తొలి పరిచయం ఆకాంక్షా శర్మ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాకు లియోన్‌ జేమ్స్‌ సంగీతం అందిస్తున్నారు.
ఇప్పటి వరకు విశ్వక్ సేన్ నటించిన అన్నీ మూవీస్ లో ఆయన క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉండేది. మాస్ కా దాస్ పాత్రలలో తెరపై కనిపించే విశ్వక్..  ఇప్పుడు ఈ సినిమాలో లేడి కేటాప్ లో అదరగొట్టనున్నారు. ఇక పోయిన సంవత్సరంలోనే ఈ సినిమాకు హైదరాబాద్‌లో ముహూర్తం, పూజా కార్యక్రమం ద్వారా సినిమా ప్రకటన వెలువడింది. ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాత కె. రాఘవేంద్రరావు , దర్శకుడు హరీష్ శంకర్ , నిర్మాత వెంకట సతీష్ కిలారు హాజరైన సందర్భంగా చిత్ర ప్రత్యేక ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను కూడా ఆవిష్కరించారు.
అయితే తాజాగా ఈ సినిమా టీజర్ విడుదల అయ్యింది. ఆ టీజర్ లో విశ్వక్ సేన్ లేడిగా కనిపించారు. లేడి లుక్ లో విశ్వక్ ఆకట్టుకున్నారు. ఇక బీజీఎమ్, మ్యూజిక్ అయితే అదిరిపోయింది. లైలా సినిమా కోసం టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నట్లు మూవీ మేకర్స్ తెలిపారు. ఈ మూవీకి రిచర్డ్ ప్రసాద్ డీవోపీ కాగా, వాసుదేవ మూర్తి రైటర్. ఇక బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. ఇక మాస్ కా దాస్.. లేడి గెటప్ లో వస్తుండడంతో ప్రేక్షకులలో అంచనాలు పెరుగుతున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: