అయితే ఇటీవల మెగా హీరో రామ్ చరణ్ అన్ స్టాపబుల్ షోలో సందడి చేశారు. అందులో బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తారు. అయితే షోలో బాలయ్యతో కలిసి రామ్ చరణ్ చాలా విషయాలు పంచుకున్నాడు. అలాగే రామ్ చరణ్ ఈ షోలో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఎప్పుడైనా ఫెయిల్యూర్స్ ఎదురైనప్పుడు, జీవితంలో అనుకోని ఘటనలు, బాధ పడే విషయాలు చోటు చేసుకున్నప్పుడు వాటి నుంచి ఎలా బయటకు వస్తావు అని బాలయ్య బాబు, రామ్ చరణ్ ని అడిగాడు.
దానికి రామ్ చరణ్ మాట్లాడుతూ.. 'జీవితంలో మనకు జరిగే ప్రతీ ఒక్కటి ఓ అనుభవమే.. తప్పులు అందరం చేస్తూనే ఉంటాం. కానీ చేసిన తప్పే మళ్లీ చేయకూడదు. అన్నింటికి కాలమే సమాధానం చెబుతుంది. ఓ యాక్షన్ జరిగింది కదా.. అని వెంటనే రియాక్షన్ ఇవ్వాల్సిన పని లేదు. కాస్త వెయిట్ చేస్తే.. టైం ఇస్తే.. అన్నీ సెట్ అవుతాయి. మన టైం వచ్చే వరకు ఆగాలి.. ప్రతీ రోజూ మనది కాకపోవచ్చు. అన్ని రోజులు మనకు కలిసి రావు అనే నిజాన్ని యాక్సెప్ట్ చేయాలి. పెద్దల సలహాలు, సూచనలు వింటూ ముందుకు వెళ్తుండాలి. బాధలు కలిగాయని, ఫెయిల్యూర్స్ వచ్చాయని బాధపడకూడదు. నిజాన్ని యాక్సెప్ట్ చేయాలి. కాస్త బాధపడి వదిలేయాలి.. దేనికీ ఎక్కువగా కుమిలిపోయి బాధపడకూడదు. నా చుట్టూ నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఫ్యాన్స్ ఉంటారు.. వాళ్లే నా బలం.. నేను ఒంటరిని అయ్యాను అనే ఫీలింగ్ నాకు ఎప్పుడూ ఉండదు' అని బాదులిచ్చారు.