ఈ కార్యక్రమంలో దిల్ రాజు ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. 'సినిమా ప్రమోషన్స్‌లో మేం ఎంతో చెబుతాం.. సినిమా బాగుందని అంటాం. అదంతా మా అంచనా, మా ఊహ.. కానీ అవే మాటలు ఆడియెన్స్ నుంచి వచ్చినప్పుడు మాకు సంతోషంగా అనిపిస్తుంది. ఈ సినిమాకు అద్భుతమైన విజయాన్ని అందించారు. ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుందని అనిల్ ముందు నుంచి చెబుతూనే ఉన్నాడు. వెంకటేష్, ప్రొడ్యూసర్స్.. సినిమా అయిపోయిన తరువాత కూడా ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు. అసలు ప్రమోషన్స్ ఎలా చేయాలో మళ్లీ అనిల్ రావిపూడి వద్ద నేర్చుకోవాలి. ప్రమోషన్స్ సరిగ్గా చేస్తే.. ఎలాంటి ఓపెనింగ్స్ వస్తాయో ఈ మూవీ నిరూపించింది. క్లిష్టకాలంలో సంక్రాంతికి వస్తున్నాం సినిమా వచ్చింది. ఈ సంక్రాంతిని మేం ఎప్పటికీ మర్చిపోలేం.. మాకు అద్భుతం జరిగింది. అద్భుతమైన విజయాన్ని అందించారు' అంటూ దిల్ రాజు ఎమోషనల్ అయ్యారు.
ఇక ఎన్నో మంచి మంచి సినిమాలను తెలుగు సినీ ఇండస్ట్రీలో నిర్మించి విజయం సాధించిన దిల్ రాజు అగ్ర నిర్మాతల్లో ఒకరిగా పేరు సంపాదించుకున్నారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం ప్రముఖ తెలుగు చిత్ర నిర్మాత దిల్‌రాజుకి తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీఎఫ్‌డీసీ) ఛైర్మన్‌గా ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే.