తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియా వేదికగా ఫోటోలు పోస్ట్ చేసింది. ఆ ఫోటోలో ప్రియాంక సింగ్ అందం అమ్మాయిలే అసూయపడేలా ఉంది. ఈ అందాల భామ ఎక్స్పోజింగ్ ఫోటోలు పెట్టి.. పల్లెటూర్ పడుచు అంటూ రాసుకొచ్చింది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే బిగ్ బాస్ ప్రియాంక సింగ్ ఫోటోలకు కామెంట్స్ ల వర్షం కురుస్తుంది. ఇక ఈ భామ హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది. ఓ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ మూవీ చేస్తోంది. ఈ మూవీకి ఘంటసాల విశ్వనాథ్ దర్శకత్వం వహిస్తున్నాడు. మ్యూజిక్ డైరెక్టర్ అయిన ఘంటసాల విశ్వనాథ్ ఈ సినిమాతోనే దర్శకుడిగా టాలీవుడ్‌కు పరిచయం అవుతోన్నారు. ఈ సినిమాలో ప్రియాంక సింగ్‌తో పాటు ఆదర్శ్ , అశ్రీత్, పూజిత కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది.
ఈ సినిమా టెక్నాలజీ, ఎమోషన్స్ లింగ సమానత్వం అంశాలను టచ్ చేస్తూ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. త్వరలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుందని డైరెక్టర్ ఘంటసాల విశ్వనాథ్ స్పష్టం చేశారు. ఈ మూవీకి వేణుబాబు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. మూవీకి పవన్ చరణ్, జీవీ సంగీతాన్ని అందిస్తుండగా.. దిలీప్ కుమార్ చిన్నయ్య సినిమాటోగ్రఫీ సమకూర్చుతున్నారు.