సంక్రాంతి కానుకగా ప్రతి సంవత్సరం ఏవో కొన్ని సినిమాలు రిలీజ్ అవుతూనే ఉంటాయి. ఈ సంవత్సరం సంక్రాంతి మూడు బడా సినిమాలు విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు అందరి చూపు తండేల్ సినిమాపైనే పడింది. యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం తండేల్. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయింది. ఈ సినిమాకు చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు. నాగచైతన్య సరసన హీరోయిన్గా సాయి పల్లవి అద్భుతంగా నటించింది.
ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకుల్లో భారీగా అంచనాలను పెంచేస్తున్నాయి. వాలెంటైన్స్ వీక్ లో ఫిబ్రవరి 7, 2025న ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రానుంది. దీంతో ఈ సినిమాపై అభిమానుల లోనే కాకుండా, ట్రేడ్ లోను భారీగా అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే తండేల్ సినిమా నుంచి విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్ కు ఆడియన్స్ నుంచి ట్రేమండస్ రెస్పాన్స్ వస్తోంది.
టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోగా.... బుజ్జి తల్లి, నమో నమః శివాయ పాటలు చాట్ బస్టర్ గా నిలిచాయి. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ పాటలే వినిపిస్తున్నాయి. ఇదంతా సినిమా చుట్టూ బలమైన ఆశలను పెంచుతోంది. బాక్సాఫీస్ వద్ద కచ్చితంగా మ్యాజిక్ చేస్తుందని నమ్మకాన్ని కలిగిస్తోంది. గతంలో నాగచైతన్య, సాయి పల్లవి కలిసి నటించిన "లవ్ స్టోరీ'' సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.
రాజు, బుజ్జి తల్లి అని ఇద్దరి మధ్య జరిగే అద్భుతమైన గ్రామీణ ప్రేమ కథతో సినిమా విడుదల కాబోతోంది. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలోని డి. మచ్చిలేశం గ్రామంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తండేల్ వస్తోంది. ఇందులో నాగచైతన్య ఒక మత్స్యకారునిగా తొలిసారిగా డీగ్లామర్ లుక్ లో కనిపించనున్నారు. గీత ఆర్ట్స్ బ్యానర్ లో బన్నీ వాసు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. ఇక ఈ సినిమా కోసం అభిమాణులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.