ఈ సినిమా హిట్ తో శ్వేత లైఫ్ చేంజ్ అవుతుందని ప్రతి ఒక్కరు అనుకున్నారు. కానీ ఈ బ్యూటీ నటించిన కొత్త బంగారులోకం సినిమా అనంతరం శ్వేతా నటించిన సినిమాలేవి పెద్దగా సక్సెస్ కాలేకపోయాయి. అంతేకాదు సినిమా అవకాశాలు ఇవ్వడానికి కూడా ఎవరూ పెద్దగా ఆసక్తిని చూపించలేదు. సినిమా ఛాన్సులు రాకపోవడంతో శ్వేతా బసు ప్రసాద్ వ్యభిచార కూపంలో ఇరుక్కుని ఓ హోటల్ లో పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. ఈ ఘటన నుంచి శ్వేత బయటపడడానికి చాలా సమయం పట్టింది.
ఆ తర్వాత 2018 లో శ్వేతా బసు ప్రసాద్ రోహిత్ మిట్టల్ అనే ప్రముఖ వ్యాపారవేత్తను ప్రేమించి వివాహం చేసుకుంది. వీరిద్దరూ సంవత్సరం గడవకముందే విభేదాల కారణంగా విడాకులు తీసుకున్నారు. అనంతరం బాలీవుడ్ కి మారిపోయిన ఈ అమ్మడు ఇండియా లాక్ డౌన్, క్రిమినల్ జస్టిక్ వంటి పలు వెబ్ సిరీస్ లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో ఈ బ్యూటీ చాలా యాక్టివ్ గా ఉంటుంది.
అదే రీతిలో తనదైన అందాలతో హాట్ హాట్ ఫోటోలకు ఫోజులు ఇస్తూ ఆ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ కుర్రాళ్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఒకప్పుడు ఈ బ్యూటీ చాలా ముద్దుగా, బొద్దుగా, అందంగా కనిపించేది. కానీ ఇప్పుడు బక్క చిక్కి కనిపించింది. పూర్తిగా ఈ అమ్మాయి ఎవరు అనేంతలా మారిపోయింది. ఈ ఫోటోలు చూసి ఇంత గోరంగా అయ్యావ్ ఏంటి అని కొంతమంది నెగటివ్ గా ట్రోల్ చేస్తున్నారు.