మొదట్లో ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని రాయలసీమలోని అనంతపురంలో చాలా గ్రాండ్గా చేయాలనుకున్నారు. కొన్ని కారణాల చేత ఈవెంట్ క్యాన్సిల్ అయ్యింది. అయితే ఇప్పుడు తాజాగా నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమా సక్సెస్ ఈవెంట్లో మాట్లాడుతూ.. జనవరి 22న అనంతపురంలో డాకు మహారాజ్ విజయోత్సవాన్ని చాలా గ్రాండ్గా జరుపుతామని తెలియజేశారు. తాను ఎక్కువగా దైవాన్ని నమ్ముతానని అలాగే తన తల్లిదండ్రుల ఆశీర్వాదం పొందాల్సిందే.. కలమ్మ తల్లి ఆశీర్వాదంతో ఇవన్నీ కలిగితేనే ఒక డాకు మహారాజు అంటూ వెల్లడించారు.
తనకు ఇది వరుసగా నాలుగో విజయమని కోవిడ్ సమయంలో అఖండ సినిమా విడుదల చేసి మంచి విజయాన్ని అందుకున్నామంటూ తెలిపారు. ఆ సమయంలో ప్రేక్షకులు థియేటర్స్ కు వస్తారనే ధైర్యాన్ని ఇతర సినిమాలకు కలిగించింది తమ సినిమానే అంటూ తెలియజేశారు బాలయ్య. ఆ తర్వాత వీరసింహారెడ్డి, భగవంతు కేసరి సినిమా ఇలా ప్రతి చిత్రాన్ని కూడా తాను ఒక ఛాలెంజింగ్గా తీసుకుని మరి చేశానని వెల్లడించారు. తన చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు అంటూ వెల్లడించారు బాలయ్య. అలాగే మంచి సినిమాలను మంచి రివ్యూలు ఇచ్చి ప్రజలకు తీసుకువెళ్లే మిత్రులకు కూడా కృతజ్ఞతలు అని తెలిపారు బాలయ్య