ప్రస్తుతం మంచు మనోజ్ విష్ణుల మధ్య ట్విట్టర్ వార్ నడుస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఆ మధ్యకాలంలో కొన్ని గొడవలు వచ్చి ప్రశాంతంగా ఉంది అనుకునే సమయంలోనే మళ్ళీ సంక్రాంతి పండుగ సమయంలో మోహన్ బాబు కాలేజీ లోకి మనోజ్ వెళ్లడానికి ప్రయత్నించడంతో మళ్ళీ గొడవలు స్టార్ట్ అయ్యాయి.అయితే ఆ తర్వాత సైలెంట్ అయిపోయిన మంచు ఫ్యామిలీ లో మంచు విష్ణు మళ్ళీ తమ్ముడిని కెలికాడు. తండ్రికి సంబంధించిన డైలాగులు షేర్ చేస్తూ ప్రతి కుక్క సింహాసనం మీద కూర్చోవాలని అనుకుంటుంది అంటూ ఒక వీడియో షేర్ చేశారు.అయితే ఈ వీడియోకి కౌంటర్ ఇచ్చిన మనోజ్ ఆ కుక్కవి నువ్వేరా అన్నట్లు కూడా కౌంటర్ ఇచ్చారు.అంతేకాదు కృష్ణంరాజు నటించిన కన్నప్ప మూవీ లోని డైలాగులు షేర్ చేస్తూ కృష్ణంరాజు గారిలాగా సింహం అవ్వాలని ప్రతి ఫ్రాడ్ కుక్క అనుకుంటుంది.

 కానీ నువ్వు ఇదే జన్మలో ఈ విషయం తెలుసుకుంటావు అని డైరెక్ట్ గా మంచు విష్ణుకు సంబంధించిన హాలీవుడ్ వెంచర్,విస్మిత్ అంటూ క్లూ లు ఇచ్చి మరీ మనోజ్ కౌంటర్ ఇచ్చారు.అక్కడితో ఆగకుండా మనోజ్ మోహన్ బాబు హీరోగా నటించిన సినిమాలోని ఓ వీడియోని వాడుకుంటూ దీన్ని కూడా విష్ణు కి కౌంటర్ గా ఇచ్చాడు. ఇక ఆ వీడియోలో ఏముందంటే.. మోహన్ బాబు సీనియర్ నటుడు జయప్రకాష్ రెడ్డి దగ్గరికి వెళ్ళగా ఆయన నీకెంత కావాలి అని అడుగుతాడు. దానికి మోహన్ బాబు నేను తెచ్చిన దస్తావేజులు  నాకు కావాలి నాకు ఇచ్చేయండి అని అడుగుతాడు. దానికి జయప్రకాష్ రెడ్డి పక్కనే ఉన్న మరో విలన్ ఏంటి కాళ్లు దువ్వుతున్నావా బసవా అంటే..నేను కాలు దువ్వాలని రాలేదు.


నేను కాలు దువ్వాలనుకుంటే అడుగుపెట్టగానే తలనరికి నీ పెళ్ళాం ఒళ్ళో పెట్టే వాడిని.కానీ నా ఆలీ వద్దని చెప్పింది కాబట్టి ఊరుకుంటున్నాను. గొడవలు మానేసి చేసిన పాపాలన్నీ కడుక్కో అంటూ ఓ డైలాగ్ షేర్ చేశాడు. ఈ డైలాగ్ కి కూడా ఇన్ డైరెక్ట్ విష్ణుపైనే చేస్తున్నట్లు హాలీవుడ్ వెంచర్,విస్మిత్ అని పేర్లు కూడా పెట్టాడు.ప్రస్తుతం అన్నదమ్ముల మధ్య ఈ ట్విట్టర్ వార్ కొనసాగుతూనే ఉంది.అయితే సైలెంట్ గా ఉన్న మనోజ్ ని విష్ణు కావాలనే కెలికి మరీ కయ్యం పెట్టుకున్నాడు అని చాలామంది విష్ణు ని తిడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: