ఇస్మార్ట్ బ్యూటీనిధి అగర్వాల్ “ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..నాగచైతన్య, చందు మొండేటి డైరెక్షన్ లో వచ్చిన “ సవ్యసాచి “ సినిమాతో ఈ భామ తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.. ఆ సినిమా అంతగా ఆకట్టుకోకపోయిన నిధి లుక్స్ కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.. ఆ తరువాత అఖిల్ తో “ మిస్టర్ మజ్ను “ అనే సినిమా కూడా చేసింది.. ఆ సినిమాభామ కెరీర్ కి అంతగా ఉపయోగపడలేదు.. పూరీ జగన్నాధ్, రామ్ పోతినేని కాంబినేషన్ లో వచ్చిన “ ఇస్మార్ట్ శంకర్ “ సినిమాలో ఈ భామని హీరోయిన్ గా తీసుకున్నారు..ఆ సినిమాలో నిధి అగర్వాల్ ని దర్శకుడు పూరీ జగన్నాథ్ ఎంతో గ్లామర్ లుక్ లో చూపించాడు.. ఇస్మార్ట్ శంకర్  సినిమాలో నిధి హాట్ అందాలకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.. ఊహించినట్లుగానే ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది.. దీనితో నిధి అగర్వాల్ ఇస్మార్ట్ బ్యూటీ గా మారిపోయింది..ఈ సినిమా తరువాత నిధి అగర్వాల్ కి స్టార్స్ సరసన ఆఫర్స్ వచ్చాయి.. 

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది.. పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది.. ఈ సినిమా ఎప్పుడో మొదలవడంతో ఈ సినిమా కోసం నిధి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ వచ్చింది.. ఎట్టకేలకు ఈ సినిమాను మేకర్స్ 2025 మార్చి 28 న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.. అలాగే నిధి అగర్వాల్ మరో భారీ సినిమాలో నటిస్తుంది.. అదే ప్రభాస్, మారుతీ కాంబినేషన్ లో వస్తున్న “రాజాసాబ్ “.. హారర్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిధితో పాటు మరో ఇద్దరు హీరోయిన్స్ నటిస్తున్నారు.. ప్రస్తుతం నిధి ఆశలన్నీ ఈ రెండు సినిమాలపైనే మరి ఈ భామకి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు వస్తుందో లేదో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: