‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీతో బ్లాక్ బష్టర్ హ్యాట్రిక్ రికార్డును క్రియేట్ చేసిన అనీల్ రావిపూడి వెంకటేష్ ల కాంబినేషన్ లో 8 నుంచి 10 సినిమాలు నిర్మించాలని అనేక నిర్మాణ సంస్థలు వీరిద్దరినీ కలపాలని భారీ పారితోషికాలు ఆఫర్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈవిషయంలో స్వయంగా అనీల్ రావిపూడి ఒక ఇంటర్వ్యూలో ఇచ్చిన లీకులను బట్టి వస్తున్న ఈ వార్తలు నిజమే అన్న సందేహాలు వస్తున్నాయి.



మూవీ కేవలం రెండు రోజులలో 72 కోట్లు గ్రాస్ కలక్షన్స్ వసూలు చేయడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. దీనితో వీరిద్దరి కాంబినేషన్ పై విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. వెంకటేష్ తన కెరియర్ లో 75 సినిమాల వరకు నటించినప్పటికీ వెంకటేష్ బాడీ లాంగ్వేజ్ ను అనీల్ రావిపూడి ఉపయోగించుకున్నట్లుగా మరే దర్శకుడు గతంలో వెంకీ నుండి నటన రాబట్టలేక పోయాడు అన్న కామెంట్స్ కొందరు చేస్తున్నారు.  



ఫిలిమ్ ఇండస్ట్రీలో గతంలో ఇలాంటి క్రేజీ కాంబినేషన్స్ చాల ఉండేవి. ఎన్టీఆర్ – రాఘవేంద్రరావు చిరంజీవి – కోదండరామిరెడ్డి బాలకృష్ణబి గోపాల్ ప్రభాస్ – రాజమౌళి ఇలా చాలా కాంబినేషన్స్ నిర్మాతలకు కోట్లు కురిపించిన సందర్బాలు గతంలో చాల ఉన్నాయి. అయితే అనిల్ రావిపూడి వెంకటేష్ కాంబినేషన్ పట్ల క్రేజ్ ఆకాశాన్ని తాకు తోంది. దీనితో వీరిద్దరి కాంబినేషన్ రిపీట్ చేయాలని చాలామంది ప్రయత్నిస్తున్నప్పటికీ ఎంతవరకు వీరిద్దరూ ఈ కాంబినేషన్ రిపీట్ చేస్తూ మరో సినిమా చేస్తారు అన్న సందేహాలు కొందరిలో ఉన్నాయి.



అయితే అనీల్ రావిపూడి దృష్టి మాత్రం మెగా స్టార్ చిరంజీవి పై పడింది అని అంటున్నారు. చిరంజీవిని దృష్టిలో పెట్టుకుని అనీల్ రావిపూడి వ్రాసిన కథ గతంలో చిరంజీవి నటించిన ‘ఘరానా మొగుడు’ ‘రౌడీ అల్లుడు’ రేంజ్ లో ఉంటుందని అంటున్నారు. ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించబోయే ఈమూవీ ప్రాజెక్ట్ అన్నీ అనుకూలిస్తే ఈ సంవత్సరం ప్రారంభం అవుతుంది  అని అంటున్నారు..  




మరింత సమాచారం తెలుసుకోండి: