అప్పటికి ఫోన్ చేశారంట కానీ లేట్ అయిపోతే మంచిది కాదని క్షణం ఆలస్యం చేయకుండా ఇబ్రహీం వెంటనే తన తండ్రిని ఆటో ఎక్కించి ఆసుపత్రికి తీసుకెళ్లాడు. వాళ్ల ఇల్లు నుంచి దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న లీలావతి ఆసుపత్రికి పరుగులు తీశారు. ఈ ఘటన జరిగిన వెంటనే తీసిన వీడియోలో సైఫ్ భార్య కరీనా కపూర్ ఖాన్ ఆటోరిక్షా దగ్గర నిలబడి ఇంటి సిబ్బందితో మాట్లాడుతున్న దృశ్యాలు కనిపించాయి.
54 ఏళ్ల సైఫ్ అలీ ఖాన్‌కు మొత్తం ఆరు కత్తిపోట్లు తగిలాయి. వాటిలో రెండు చాలా లోతుగా ఉన్నాయి. ఒకటి వెన్నెముక దగ్గర కూడా ఉంది. దొంగ మొదట ఇబ్రహీం గదిలోకి ప్రవేశించడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో సైఫ్ అతడిని అడ్డుకునే ప్రయత్నం చేయగా ఈ దాడి జరిగింది. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించి, వైద్యులు శస్త్రచికిత్స చేసి కత్తి ముక్కను బయటకు తీశారు. మొదట్లో ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నా, ప్రస్తుతం ప్రమాదం నుంచి బయటపడ్డారని, ఐసీయూలో కోలుకుంటున్నారని ఆయన టీమ్ తెలిపింది. వైద్యులు ఆయన ఆరోగ్యాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు.
ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దొంగ పైపు ద్వారా భవనంలోకి ప్రవేశించి ఉంటాడని అనుకుంటున్నారు. భవనంలో సరైన భద్రత లేకపోవడం వల్ల దొంగ సులభంగా లోపలికి ప్రవేశించాడు. ఇంట్లోని ఓపెన్ విండో ద్వారా లోనికి వచ్చిన దొంగ చోరీ చేయాలనే ఉద్దేశంతో దాక్కున్నాడు. అయితే ఇంటి పనిమనిషి అతడిని గుర్తించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
ఈ దాడికి ఉగ్రవాద సంస్థలకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులు తేల్చి చెప్పారు. భవనంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీని ద్వారా మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. దాడి చేసిన వ్యక్తిని గుర్తించేందుకు, జరిగిన సంఘటనల పూర్తి క్రమాన్ని తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ షాకింగ్ ఘటన బాలీవుడ్ లో తీవ్ర కలకలం రేపింది.