తెలుగు సినిమా పరిశ్రమలో అద్భుతమైన స్థాయికి చేరుకున్న హీరోయిన్లలో తెలుగు అమ్మాయిలు చాలా తక్కువ మంది ఉంటారు. ఎక్కువ శాతం ఇతర భాష ముద్దు గుమ్మలు తెలుగులో అద్భుతమైన స్థాయికి చేరుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీ లో తెలుగమ్మాయి అయి ఉండి అద్భుతమైన స్థాయికి చేరుకున్న వారిలో రీతూ వర్మ ఒకరు. ఈ ముద్దుగుమ్మ విజయ్ దేవరకొండ హీరోగా తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన పెళ్లి చూపులు అనే సినిమాతో హీరోయిన్గా వెండి తెరకు పరిచయం అయింది.

సినిమా మంచి విజయం సాధించడంతో ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ లో మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత రీతూ తెలుగు తో పాటు వేరే భాషల సినిమాల్లో కూడా హీరోయిన్గా నటించి ఇతర భాషల్లో కూడా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇకపోతే పోయిన సంవత్సరం ఈ ముద్దుగుమ్మ శ్రీ విష్ణు హీరోగా ఆసిత్ గోలి దర్శకత్వంలో రూపొందిన స్వాగ్ అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే ప్రస్తుతం ఈ నటి సందీప్ కిషన్ హీరోగా త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో రూపొందుతున్న మజాకా అనే సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది.

ఈ సినిమాను ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ మొదట ప్రకటించారు. కానీ ఆ తర్వాత ఈ మూవీ ని సంక్రాంతి బారి నుండి తప్పించారు. ఈ మూవీ ని ఫిబ్రవరి నెలలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీ బృందం వారు కొన్ని రోజుల క్రితం ఈ సినిమా టీజర్ నిట్ విడుదల చేయగా ఆ టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా మంచి విజయం సాధిస్తే ఈ ముద్దుగుమ్మ క్రేజ్ తెలుగు లో మరింత పెరిగే అవకాశం చాలా వరకు ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: