అయితే, హైపర్ ఆది రాజకీయపరమైన విషయాల్లో కూడా తన గళం వినిపిస్తుంటాడు. రీసెంట్‌గా జరిగిన కొన్ని మీటింగుల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ముఖ్యంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌పై ఆయన వేసిన సెటైర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల సంక్రాంతి పండుగ సందర్భంగా ఓ టీవీ షోలో హైపర్ ఆది చేసిన స్కిట్ హాట్ టాపిక్‌గా మారింది. పుష్ప 2 సినిమాలోని శీను పాత్రలో ఆది కనిపించాడు. తన స్నేహితులను కాపాడటానికి పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన శీనుగా ఇరగదీశాడు.
ఇక పోలీస్ ఆఫీసర్‌గా దొరబాబు కూడా తనదైన శైలిలో కామెడీ పండించాడు. "రూల్స్ గురించి నాకే చెబుతున్నారా?" అంటూ ఆది అడగగా, దానికి దొరబాబు ఆశ్చర్యంగా "నువ్వా?" అని రిప్లై ఇవ్వడం నవ్వులు పూయించింది. నిబంధనలు పాటించనందుకు అల్లు అర్జున్ క్యారెక్టర్‌ను అరెస్ట్ చేసిన సీన్‌ను పరోక్షంగా గుర్తు చేస్తూ ఈ స్కిట్ సాగింది.
ఇక స్కిట్‌లో దొరబాబు చెప్పిన మరో డైలాగ్ అయితే హైలైట్. "ఒకసారి లోపలికి వెళ్ళిన వస్తువుల్ని బయటికి తీసే అలవాటు మాకు లేదు" అని దొరబాబు అనడం మరింత కామెడీని జోడించింది. ఆది తనదైన శైలిలో కౌంటర్లతో దొరబాబును ఆడుకున్నాడు. స్కిట్ మొత్తం సరదాగా సాగినా అది అల్లు అర్జున్‌ను టార్గెట్ చేసినట్టుగా ఉండటంతో ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
హైపర్ ఆది చేసిన ఈ సెటైర్‌పై అల్లు అర్జున్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. కామెడీ పేరుతో తమ హీరోని కించపరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. తమ అభిమాన హీరోను ఎవరైనా అవమానిస్తే సహించేది లేదని తేల్చి చెబుతున్నారు. గతంలో తన కామెడీ శృతి మించినప్పుడు క్షమాపణలు చెప్పిన సందర్భాలున్నాయి హైపర్ ఆదికి. మరి ఈసారి కూడా ఆయన దిగివస్తాడా లేదా చూడాలి. ప్రస్తుతానికి మాత్రం హైపర్ ఆది, అల్లు అర్జున్‌పై చేసిన సెటైరికల్ కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.