స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న సాయి పల్లవి తన నాచురల్ యాక్టింగ్ తో ఎంతోమందిని కట్టిపడేస్తుంది.సినిమా చూసే ప్రేక్షకులు థియేటర్లో సాయి పల్లవి నటన చూసి చూపు తిప్పుకోరు అంటే అతిశయోక్తి కాదు. ఆ సినిమా హిట్ అయిన ప్లాఫ్ అయినా కూడా సాయి పల్లవి నటనకు మాత్రం మంచి మార్కులు పడతాయి. అలాగే గత ఏడాది సాయి పల్లవి నటించిన అమరన్ సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.ఈ సినిమా మేజర్ ముకుంద్ వరదరాజన్ ఆత్మకథగా తెరకెక్కింది. ఇందులో ముకుంద్ భార్య ఇందూ రెబెకా వర్గీస్ పాత్రలో సాయి పల్లవి తన నటనతో కట్టిపడేసిందని చెప్పుకోవచ్చు. అయితే అలాంటి సాయి పల్లవి 2024 లో ఒక్క సినిమాతోనే వచ్చినప్పటికీ 2025 లో మాత్రం రెండు మూడు సినిమాలతో పలకరించబోతున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఈ ఏడాది సాయి పల్లవి నటిస్తున్న రెండు మూడు సినిమాలు విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది.దీంతో 2025 సంవత్సరం సాయి పల్లవిదే అంటూ ఆమె ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. 

ఇక 2025 ఫిబ్రవరి 7న సాయి పల్లవి నాగచైతన్య కలిసి నటిస్తున్న తండేల్ మూవీ విడుదలవుతుంది.ఈ సినిమా నాగచైతన్య కెరీర్ లోనే భారీ బడ్జెట్ తెరకెక్కుతున్న మూవీ. అలాగే ఈ సినిమా నుండి విడుదలైన రెండు పాటలు ఇప్పటికే ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. బుజ్జి తల్లి పాట మాత్రం ఇప్పుడు యూత్ కి రింగ్టోన్ గా మారిపోయింది. అలాగే ఇందులో సాయి పల్లవి యాక్టింగ్ కూడా బాగుంటుందని తెలుస్తోంది.ఈ సినిమాతో పాటు సాయి పల్లవి బాలీవుడ్ లో రెండు సినిమాలు చేస్తుంది. అందులో ఒకటి రామాయణం మరొకటి అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ తో కూడా సాయి పల్లవి స్క్రీన్ షేర్ చేసుకుంటుంది. ఈ సినిమా కూడా 2025 లో విడుదల కాబోతున్నట్టు తెలుస్తోంది. అయితే నితేష్ తివారి దర్శకత్వంలో వస్తున్న రామాయణం మూవీ 2025 లో కాకుండా 2026 లో విడుదల కాబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా పై ఇప్పటికి ఎన్నో అంచనాలు ఉన్నాయి. 

ఇందులో రావణాసురుడి పాత్రలో కన్నడ స్టార్ హీరో యష్, రాముడి పాత్రలో రణబీర్ కపూర్, సీత పాత్రలో సాయి పల్లవి, సూర్పనఖ పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ వంటి భారీ తారాగణంతో ఈ సినిమా తెరకెక్కుతుంది.దాంతో ఈ సినిమా విషయంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకు ఈ మూవీ డైరెక్టర్ సినిమా షూటింగ్ లేట్ అయినా పర్వాలేదు కానీ అన్ని జాగ్రత్తలు తీసుకొని సినిమాని తెరకెక్కిస్తున్నారట.అందుకే ఈ సినిమా విడుదల కావడానికి మరో సంవత్సరం పడుతుందని తెలుస్తోంది.ఏది ఏమైనప్పటికీ ఈ ఏడాది సాయి పల్లవి తండేల్ మూవీ తో పాటు ఓ బాలీవుడ్ మూవీ తో కూడా మనల్ని పలకరించబోతుంది. అలాగే రీసెంట్ గా లక్కీ భాస్కర్ తో హిట్టు కొట్టిన దుల్కర్ సల్మాన్ తో కూడా సాయి పల్లవి సినిమా చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఆకాశం లో ఒక తార సినిమాలో దుల్కర్ పక్కన సాయి పల్లవి హీరోయిన్గా చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సిమా కూడా ఈ ఏడాది రాబోతున్నట్టు సమాచారం. ఇలా ఈ ఏడాదిలో సాయి పల్లవి నటించిన బ్యాక్ టు బ్యాక్ సినిమాలు విడుదలవబోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: