టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన స్థాయికి చేరుకున్న హీరోయిన్లలో ప్రియాంక అరుల్ మోహన్ ఒకరు. ఈ ముద్దుగుమ్మ నాని హీరోగా రూపొందిన నాని'స్ గ్యాంగ్ లీడర్ అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ పర్వాలేదు అనే స్థాయి విజయం సాధించిన ఈ మూవీ తో ఈ బ్యూటీ కి తెలుగు లో మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత ప్రియాంక తెలుగు లో శ్రీకారం అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ మూవీ తర్వాత ఈ బ్యూటీ ఎక్కువ శాతం తమిళ సినిమాల్లో నటించింది.

ఈమె నటించిన కొన్ని తమిళ సినిమాలు మంచి విజయాలను సాధించడంతో ఈమెకు కోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు లభించింది. కోలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న తర్వాత ఈమె మళ్లీ ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమపై ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా పోయిన సంవత్సరం ఈ బ్యూటీ నాచురల్ స్టార్ నాని హీరోగా రూపొందిన సరిపోదా శనివారం సినిమాలో హీరోయిన్గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ను అందుకుంది. ఈ మూవీ తో ఈ బ్యూటీ క్రేజ్ మరింతగా పెరిగింది. ఇది ఇలా ఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం "ఓజి" అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను డివివి దానయ్య నిర్మిస్తున్నాడు. ఈ మూవీ లో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ సినిమాపై పవన్ అభిమానులతో పాటు మామూలు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ సినిమా కనుక మంచి విజయాన్ని సాధించినట్లయితే ప్రియాంక టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ స్థాయికి చేరే అవకాశాలు ఉన్నాయి అని అనేక మంది జనాలు అభిప్రాయపడుతున్నారు. ఓజి మూవీ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుంది , ఆ మూవీ ద్వారా ఈ ముద్దుగుమ్మ క్రేజ్ ఏ రేంజ్ లో పెరుగుతుంది అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: