విక్టరీ వెంకటేష్ తాజాగా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా జనవరి 14 వ తేదీన విడుదల అయింది. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన మూడు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఇకపోతే మూడవ రోజు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల లిస్టులో అద్భుతమైన స్థానంలో నిలిచింది. మరి ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడవ రోజు హైయెస్ట్ కలెక్షన్లను వస్తువులు చేసిన తెలుగు సినిమాల లిస్టులో ఏ స్థానంలో నిలిచింది అనే వివరాలను తెలుసుకుందాం.

మూడవ రోజు హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల లిస్టులో ఆర్ ఆర్ ఆర్ మూవీ 33.53 కోట్ల కలెక్షన్లతో మొదటి స్థానంలో నిలవగా , సలార్ మూవీ 22.40 కోట్ల కలెక్షన్లతో రెండవ స్థానంలో కొనసాగుతుంది. పుష్ప పార్ట్ 2 మూవీ 21.60 కోట్ల కలెక్షన్లతో మూడవ స్థానంలో కొనసాగుతూ ఉండగా , కల్కి 2898 AD సినిమా 19.83 కోట్ల కలెక్షన్లతో నాలుగవ స్థానంలో కొనసాగుతుంది. దేవర పార్ట్ 1 19.03 కోట్ల కలెక్షన్లతో 5 వ స్థానంలో కొనసాగుతుంది. ఆది పురుష్ మూవీ 17.07 కోట్ల కలెక్షన్లతో ఆరవ స్థానంలో కొనసాగుతుంది. బాహుబలి 2 16.60 కోట్ల కలెక్షన్లతో ఏడవ స్థానంలో కొనసాగుతూ ఉండగా , పుష్ప పార్ట్ 1 మూవీ 14.38 కోట్ల కలెక్షన్లతో 8 వ స్థానంలో కొనసాగుతోంది. భీమ్లా నాయక్ మూవీ 13.51 కోట్ల కలెక్షన్లతో 9 వ స్థానంలో కొనసాగుతుంది. ఇక వెంకటేష్ హీరోగా ఐశ్వర్య రాజేష్ , మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా 13.12 కోట్ల కలెక్షన్లతో పదవ స్థానంలో నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: