నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన 'డాకు మహారాజ్' బ్లాక్ బస్టర్ టాక్ తో కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా సక్సెస్ మీట్‌లో బాలయ్య తనదైన శైలిలో సంగీత దర్శకుడు తమన్‌ను ఆకాశానికెత్తేశారు. అంతేకాదు, ఇకపై తమన్‌ను 'ఎస్ థమన్' అని కాకుండా 'NBK థమన్' అని పిలుస్తామని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రతి సినిమాను ఒక ఛాలెంజ్‌గా తీసుకుంటానని చెప్పిన బాలయ్య.. దర్శకుడు బాబీ కొల్లిపై ప్రశంసల వర్షం కురిపించారు.

బాబీ తనలోని నటుడిని సరికొత్తగా ప్రజెంట్ చేశాడని కొనియాడారు. 'డాకు మహారాజ్' సినిమా ఇప్పటికే వంద కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించి బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపేసింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన దీనిలో దర్శకుడు బాబీ కొల్లి టేకింగ్, బాలయ్య బాబు వింటేజ్ ఫామ్‌లో కనిపించడంతో బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది. యాక్షన్ సీక్వెన్స్‌లు, హై ఎనర్జీ, మాస్ అప్పీల్‌తో సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ప్రతి సీన్ గూస్‌బంప్స్ తెప్పించేలా ఉండటంతో థియేటర్లు దద్దరిల్లుతున్నాయి. తమన్ అందించిన సంగీతం పూనకాలు తెప్పిస్తోంది

బాలకృష్ణలోని మాస్ యాంగిల్స్‌ను తమన్ తన బీట్స్‌తో నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాడు. బాలయ్య, తమన్ కాంబినేషన్ తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక సంచలనంగా మారింది. ఇంతకుముందు 'అఖండ', 'వీర సింహా రెడ్డి' వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత ఇది వారిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న నాలుగో సినిమా కావడం విశేషం. ప్రతి సినిమాలోనూ తమన్ తన మ్యూజిక్‌తో బాలయ్య బాబు మాస్ ఇమేజ్‌ను మరింత పెంచేస్తున్నాడు.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తమన్ మాట్లాడుతూ.. తమ కాంబినేషన్‌కు అభిమానులు పెట్టుకున్న వైరల్ ట్యాగ్‌ను గుర్తు చేశారు. "బక్కోడికి రజనీకాంత్, బండోడికి బాలయ్య" అనేది ఆ ట్యాగ్. ఈ కాంబినేషన్ అభిమానుల్లో ఎలాంటి ఉత్సాహాన్ని నింపుతుందో ఈ ట్యాగ్ తెలియజేస్తుంది. బాలకృష్ణ సైతం తన కెరీర్‌లోని ఈ దశను "2.0" అని పిలుచుకుంటున్నారు. తమన్ తమ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తుండటంతో అభిమానులు ముద్దుగా ఆయనను నందమూరి తమన్ అని పిలుచుకుంటున్నారు. ఇక ఇప్పుడు 'అఖండ 2' రాబోతుండటంతో ఈ కాంబో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: