ఆ విషయం చెప్పడంలో అసలు సందేహమే పడాల్సిన అవసరం లేదు . 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా కేవలం మూడు రోజుల్లోనే 100 కోట్లు క్రాస్ చేసింది అంటే సినిమా ఎంత పెద్ద హిట్ అయింది అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . బడా పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ నటించిన 'గేమ్ చేంజర్ '.. నందమూరి హీరో బాలయ్య నటించిన 'డాకు మహారాజ్'.. సినిమాలను తొక్కేస్తూ 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా సూపర్ డూపర్ హిట్ గా సంక్రాంతి బరిలో విన్నర్ గా నిలిచింది . దీంతో వెంకటేష్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.
కాగా వెంకటేష్ నెక్స్ట్ ఏ డైరెక్టర్ సినిమాలో నటిస్తున్నాడు ..? అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారిపోయింది . సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం .."విక్టరీ వెంకటేష్ తన నెక్స్ట్ సినిమాను ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో నటించబోతున్నారట". అది కూడా మహేష్ బాబుకి అన్న క్యారెక్టర్ లో. ఈ విషయం తెలుసుకున్న జనాలు ఫుల్ షాక్ అయిపోతున్నారు . అంతేకాదు 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' లాంటి ఒక కాంబో రిపీట్ కాబోతుంది అని అది కూడా ఒక పాన్ ఇండియా స్థాయిలో వీళ్ళ బాండింగ్ ఇంకా మారిపోబోతుంది అంటూ అంటూ తెగ పొగిడేస్తున్నారు. చూద్దాం మరి ఎంత అవ్రకు ఈ ప్లాన్ వర్క్ అవుట్ అవుతుందో..??