అయితే 2025 సంవత్సరంలో రాబిన్ హుడ్ తో పాటు పలు క్రేజీ ప్రాజెక్ట్ లతో శ్రీలీల ప్రేక్షకుల ముందుకు రానున్నారు. 2024 కలిసొచ్చిన స్థాయిలో 2025 సంవత్సరం కూడా శ్రీలీలకు కలిసొస్తే మాత్రం ఆమె స్థాయిలో అదృష్టవంతురాలు ఎవరూ ఉండరని చెప్పవచ్చు. శ్రీలీల మంచి కథలను ఎంచుకుంటే మాత్రం ఆమె సక్సెస్ రేట్ ఊహించని స్థాయిలో పెరిగే ఛాన్స్ అయితే ఉంది.
శ్రీలీల భాషతో సంబంధం లేకుండా సత్తా చాటాల్సిన అవసరం ఉందని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు. పుష్ప2 సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో వచ్చిన క్రేజ్ ను శ్రీలీల క్యాష్ చేసుకోవాల్సి ఉంది. కిస్సిక్ సాంగ్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో ఫ్యాన్స్ సైతం ఎంతగానో సంతోషిస్తున్నారు. శ్రీలీల నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
శ్రీలీల బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకుంటున్నారు. శ్రీలీల ఇతర భాషల్లో సైతం సంచలన విజయాలను సొంతం చేసుకునేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటారేమో చూడాల్సి ఉంది. శ్రీలీల లుక్స్ కు కుర్రకారు సైతం ఫిదా అవుతున్నారు. టైర్1 స్టార్ హీరోలు ఛాన్స్ ఇస్తే మాత్రం శ్రీలీల దశ తిరిగినట్టేనని సంచలన విజయాలు సొంతమవుతాయని చెప్పవచ్చు. 2025 సంవత్సరంలో శ్రీలీల ఏ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తారో చూడాల్సి ఉంది. శ్రీలీల క్రేజ్ అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.