'సంక్రాంతికి వస్తున్నాం'.. సినిమా అనిల్ రావిపూడి ఏం మందు పెట్టాడో తెలియదు కానీ, ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్స్ ఫ్యామిలీ లేడీస్ అందరూ కూడా 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా కచ్చితంగా చూడాలి అని.. పట్టుబట్టి మరి థియేటర్స్ కి వెళ్లి సినిమా చూస్తున్నారు.  సాధారణంగా థియేటర్స్ కి వెళ్లి సినిమా చూడడానికి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా సంక్రాంతికి వస్తున్నాం మూవీ టాక్ విన్న తర్వాత అలా థియేటర్లో సినిమా చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. టికెట్ కాస్ట్ ఎక్కువైనా సరే ఫ్యామిలీ మొత్తం వెళ్లి సినిమా చూసి నవ్వుకోడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా గురించి ఓ వార్త బాగా ట్రెండ్ అవుతుంది.

ఈ సినిమాలో వెంకటేష్ ఫ్యామిలీ హీరోగా కనిపిస్తాడు . ఆయన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గా మీనాక్షి చౌదరి .. భార్యగా ఐశ్వర్య రాజేష్ లీనమైపోయినటిస్తారు . అయితే ఐశ్వర్య రాజేష్ భరతనాట్యం లో అరంగేట్రం చేసిన తర్వాత స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది . ఆ టైంలో అక్కడికి వచ్చిన పెద్దమనిషి స్పీచ్ ఇవ్వబోతూ ఉండగా .. మా ఆయన స్పీచ్ ఇస్తాడు అంటూ చెబుతుంది . అంతకుముందే 'సాలువా కప్పి అవార్డు ఇవ్వబోతూ ఉండగా ..మీరు ఏమనుకోకపోతే నేను మా బా దగ్గర నుంచి ఈ సాల్వా - అవార్డు తీసుకుంటాను ' అంటూ చెబుతుంది .

గతంలో ఓ పెద్ద ఈవెంట్లో అల్లు అర్జున్ చేతుల మీదుగా నయనతార అవార్డు తీసుకోబోతూ ఉండగా వెంటనే నయనతార అడ్డుకొని.." ఈ అవార్డుని నేను అల్లు అర్జున్ చేతుల మీదుగా కాకుండా విగ్నేష్ శివన్ చేతులు మీదుగా తీసుకోవాలి అనుకుంటున్నాను" అంటూ చెప్పుకు వచ్చింది . అప్పట్లో బన్నీ ఫ్యాన్స్ దీని పట్ల బాగా ఎక్కువగా కోప్పడ్డారు . ఆ తర్వాత రివేంజ్ కూడా బన్నీ తీర్చుకున్నాడు అంటూ రకరకాల కామెంట్స్ వైరల్ అయ్యాయి. అది వేరే మూఅటర్. అయితే ఆ సిచువేషన్ ని బేస్ చేసుకుని ఈ సీన్ తెరకెక్కించినట్లు అనిల్ రావిపూడి అంటూ డైరెక్టర్ క్రియేటివిటీని మెచ్చుకుంటున్నారు..!

 

మరింత సమాచారం తెలుసుకోండి: