మహిళలపై లైంగిక దాడి కేసులు ఈ మధ్య కాలంలో విపరీతంగానే పెరిగిపోతున్నాయి. అయితే.. తాజాగా టాలీవుడ్‌ ఇండస్ట్రీలోనే.. మహిళపై లైంగిక దాడి సంఘటన కలకలం రేపుతోంది. సినిమాల్లో ఛాన్స్ అంటూ మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడు ఓ దుర్మార్గుడు. ఈ సంఘటన ఇప్పుడు టాలీవుడ్‌ ఇండస్ట్రీని కుదిపేస్తోంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సినిమాల్లో ఛాన్స్ అంటూ మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడు టాలీవుడ్‌ ఇండస్ట్రీకి చెందిన అసిస్టెంట్ డైరెక్టర్.


దీంతో బాధితులురాలి ఫిర్యాదు మేరకు ఆ అసిస్టెంట్ డైరెక్టర్ మీద కేసు కూడా బుక్‌ అయింది. ఆడిషన్స్ పేరుతో ఇంటికి పిలిచి మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడు టాలీవుడ్‌ ఇండస్ట్రీకి చెందిన అసిస్టెంట్ డైరెక్టర్ కాటేకొండ రాజు.  భర్తతో విడిపోయి మూడేళ్ల క్రితం నగరానికి వచ్చి మణికొండలో బంధువుల ఇంట్లో ఉంటోంది ఓ మహిళ. ఇక ఇటీవల అమీర్ పేట లోని  హాస్టల్ లో చేరింది సదరు మహిళ.  


15 రోజుల కింద ఓ సినిమాలో హౌస్ కీపింగ్ ఆర్టిస్ట్ గా పనిచేసింది ఆ బాధిత మహిళ. అయితే... సినిమాలలో జూనియర్ ఆర్టిస్ట్ గా చేయాలని ఆసక్తి ఉండడాన్ని గమనించాడు  టాలీవుడ్‌ ఇండస్ట్రీకి చెందిన అసిస్టెంట్ డైరెక్టర్ కాటేకొండ రాజు.  అసిస్టెంట్ డైరెక్టర్ గా చెప్పుకుని మహిళతో పరిచయం చేసుకున్నాడట రాజు. ఈ తరుణంలోనే..... ఆడిషన్స్ పేరుతో కృష్ణానగర్ లోని హెవెన్ హోటల్ కు పిలిచి ఫోటోషూట్ చేసి రకరకాల ఫోటోస్ తీశాడట రాజు.  


మరుసటి రోజు రావాలని చెప్పగా.. రెండో రోజు గదికి వెళ్ళిన మహిళ పై లైంగిక దాడికి పాల్పడ్డాడు అసిస్టెంట్ డైరెక్టర్ కాటేకొండ రాజు. అయితే.. ఈ విషయం బయటకు చెబితే.. ఫోటోలు, వీడియోలు బయట పెడతానని వార్నింగ్‌ ఇచ్చాడట. అయినప్పటికీ... తగ్గని బాధిత మహిళ....  జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన  జూబ్లీహిల్స్ పోలీసులు..కేసు బుక్‌ చేశారు. నిందితుడు రాజు పై BNS  64,79,115,351(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు...అతని కోసం గాలిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: