బాలీవుడ్ స్టార్ యాక్టర్ ali KHAN' target='_blank' title='సైఫ్ అలీ ఖాన్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సైఫ్ అలీ ఖాన్ ముంబైలోని తన నివాసంలో దారుణమైన దాడికి గురైన సంగతి తెలిసిందే. జనవరి 16 సుమారు అర్ధరాత్రి 2:30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ గుర్తు తెలియని దుండగుడు బాంద్రాలోని సైఫ్ ఇంట్లోకి చొరబడి, ఇంట్లో పనిచేసే వ్యక్తిని బెదిరించి ఏకంగా రూ.1 కోటి డిమాండ్ చేశాడు. ఈ సమయంలో సైఫ్ అడ్డుకోబోగా, అతడిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. సైఫ్ వీపు భాగంలో వెన్నెముకకు సమీపంలో రెండు లోతైన గాయాలతో సహా మొత్తం ఆరు చోట్ల కత్తిపోట్లు తగిలాయి.

వెంటనే అతడిని లీలావతి ఆసుపత్రికి తరలించి అత్యవసర శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం ali KHAN' target='_blank' title='సైఫ్ అలీ ఖాన్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సైఫ్ అలీ ఖాన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. దాడి చేసిన వ్యక్తి ఇంటి వెనుక ఉన్న ఫైర్ ఎస్కేప్ ద్వారా కేవలం 2:33 నిమిషాలకే అక్కడి నుంచి తప్పించుకున్నట్లు సీసీటీవీ ఫుటేజీలో రికార్డ్ అయింది. అతడికి ఇంటి నిర్మాణం గురించి ముందే తెలిసుండవచ్చని, బహుశా ఎవరైనా ఇంట్లోవాళ్ల సహకారం కూడా ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడి కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.

ఈ దాడి జరిగిన సమయంలో సైఫ్ భార్య కరీనా కపూర్, వారి పిల్లలు ఇంట్లోనే ఉన్నా వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. అయితే, ఇంట్లో పనిచేసే ఒక మహిళ స్వల్పంగా గాయపడింది. కుటుంబం ప్రస్తుతం తమ గోప్యతను కాపాడాలని, దర్యాప్తు కొనసాగుతున్నందున ఎలాంటి ఊహాగానాలకు తావు ఇవ్వవద్దని విజ్ఞప్తి చేసింది.

ఈ ఘటన ముంబై నగరంలో, ముఖ్యంగా ప్రముఖుల భద్రతపై తీవ్ర ఆందోళనలు రేకెత్తించింది. ఇలాంటి ఘటనలు రిపీట్ అవ్వకుండా ఉండేందుకు అధికారులు ఆ ప్రాంతంలోని భద్రతా చర్యలను సమీక్షిస్తున్నారు. పోలీసులు ఇంటి సిబ్బందితో పాటు, ఇటీవల ఇంటికి వచ్చిన వ్యక్తులను కూడా విచారిస్తున్నారు. ఇదిలా ఉంటే సైఫ్ అలీ ఖాన్‌పై జరిగిన కత్తి దాడికి సంబంధించి ప్రజల్లో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అవేంటంటే,

1. దాడి చేసిన వ్యక్తి ఘటన జరిగిన తర్వాత ఇంటి నుంచి ఎలా తప్పించుకున్నాడు?

2. దాడి చేసిన వ్యక్తికి ఇంటి నిర్మాణం గురించి ముందుగా తెలుసా?

3. సైఫ్ ఆ సమయంలో కారులో ఎందుకు బయటకు వెళ్లారు?

4. సైఫ్‌తో పాటు 7 ఏళ్ల వయసున్న పిల్లవాడు ఎందుకు ఉన్నాడు? పెద్దవాళ్లు ఎవరూ లేరా?

ప్రస్తుతం అభిమానులు, ప్రజలు ఈ ప్రశ్నలకు సమాధానాల కోసం ఎదురు చూస్తున్నారు. పోలీసులు నిందితుడిని పట్టుకున్న తర్వాత మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ పేలవమైన భద్రత, లోపలి వ్యక్తుల ప్రమేయం ఉందన్న సందేహాలు ఆందోళనలను మరింత పెంచుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: