ఇందులోని కామెడీ సన్నివేశాలు ఈ సినిమాకి హైలెట్గా నిలిచాయి. సంక్రాంతికి వస్తున్నాం సినిమా సూపర్ హిట్ అవడంతో చిత్ర బృందం ఆనందంగా ఒక సక్సెస్ పార్టీని కూడా ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఈ సెలబ్రేషన్స్లో డైరెక్టర్ అనిల్ రావుపూడి చిత్ర బృందంతో పాటు నటీనటులు అందరూ కూడా పాల్గొన్నారు.ఈ పార్టీకి సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా పాల్గొనడంతో అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా వైరల్ గా మారుతున్నాయి. ఈ ఫోటోలలో మహేష్ బాబు హైలైట్ గా నిలవడం గమనార్హం. గతంలో వెంకటేష్, మహేష్ బాబు కాంబినేషన్లో విడుదలైన సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా నుంచి అటు వెంకటేష్ మహేష్ బాబు మధ్య మంచి స్నేహబంధం ఉన్నది.
ఇప్పటికే మహేష్ బాబు సంక్రాంతికి వస్తున్నాం సినిమా చూసిన తర్వాత బృందానికి కూడా కంగ్రాట్యులేషన్స్ తెలియజేస్తూ ట్విట్ చేయడం జరిగింది.. మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం రాజమౌళితో సినిమాని చేయడానికి సిద్ధమయ్యారు.ఇందుకు సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా ఇటీవలే చాలా గ్రాండ్గా జరిగాయి. గతంలో లాగానే మహేష్ బాబు లాంగ్ హెయిర్ తో కనిపించడంతో అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. మొత్తానికి సంక్రాంతికి వస్తున్నాం సినిమా సక్సెస్ పార్టీలో మహేష్ బాబుని అందంగా కనిపించడంతో పాటుగా అటు హీరో హీరోయిన్స్ మధ్య కూడా హైలెట్ గా నిలిచారు.