సౌత్ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం వరుస వివాదాల్లో ఇరుక్కుంటున్న సంగతి మనకు తెలిసిందే.అయితే ఎన్ని వివాదాల్లో ఇరుక్కున్నా కూడా నయనతార సినిమాల్లో తన జోరుని మాత్రం కంటిన్యూ చేస్తూ నాలుగు పదుల వయసు దాటినా కూడా ఈ ముద్దుగుమ్మ సినిమాల్లో జోరు కనబరిస్తూ యంగ్ హీరోయిన్లకు పోటీని ఇస్తుంది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ చేతిలో ఇప్పుడు ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి.. ఈ ఏడాది ఎన్ని విడుదల కాబోతున్నాయి అనేది ఇప్పుడు చూద్దాం.. నయనతార గత ఏడాది తన బియాండ్ ది ఫేయిరీ టెయిల్ డాక్యుమెంటరీ  కారణంగా వివాదంలో చిక్కుకున్న సంగతి మనకు తెలిసిందే. ఈ డాక్యుమెంటరీ పై ధనుష్ 10 కోట్ల పరువు నష్టం దావా కూడా వేశారు. ప్రస్తుతం ఈ కేసు ఇంకా కోర్టులో నడుస్తూనే ఉంది. అయితే అలాంటి నయనతార ఈ ఏడాది దాదాపు 7, 8 సినిమాల్లో హీరోయిన్ గా చేస్తున్నట్టు తెలుస్తోంది.

లేడీ ఓరియంటెడ్ సినిమాలతో పాటు స్టార్ హీరోల సినిమాల్లో కూడా చేస్తుంది. అయితే ఈ ముద్దుగుమ్మ లేడి ఓరియంటెడ్ మూవీ అయినటువంటి రక్కాయి సినిమాకి సంబంధించి గత ఏడాది నవంబర్లో టీజర్ విడుదలైంది.ఈ టీజర్ ఆసక్తికరంగా ఉండడంతో రక్కాయి మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి.అలాగే డియర్ స్టూడెంట్స్, మూక్కుత్తి అమ్మన్ 2, మన్నాంగట్టి సీన్స్ 1960, ఎం ఎం ఎం ఎన్ అనే మలయాళ  సినిమా తో పాటు కన్నడలో యష్ నటిస్తున్న టాక్సిక్ మూవీలో కూడా నయనతార హీరోయిన్గా చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఉమెన్ సెంట్రిక్ కథతో వస్తున్న నయనతార రక్కాయి మూవీలో భయంకరమైన తల్లి పాత్రలో నయనతార నట విశ్వరూపం చూపించబోతుందని ఇప్పటికే విడుదలైన టీజర్ చూస్తే అర్థమవుతుంది.

అంతేకాకుండా మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయినటువంటి కన్నప్పలో కూడా నయనతార ఓ కీ రోల్ చేస్తున్నట్టు వార్తలు వినిపించాయి. ఇక ప్రభాస్ నటిస్తున్న ది రాజా సాబ్ మూవీలో కూడా ప్రభాస్ తో ఒక స్పెషల్ సాంగ్లో నయనతార కనిపించబోతున్నట్టు సీనియర్ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇవే కాకుండా యంగ్ నటుడు అయినటువంటి కవిన్ తో నయనతార Hi.. :) అనే మూవీలో నటిస్తుంది. ఈ సినిమాలో నయనతార చాలా కొత్తగా కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు ఎంతో మంది సీనియర్ హీరోలు తన ఏజ్ ఉన్న హీరోలతో నటించిన ఈ ముద్దుగుమ్మ మొదటిసారి తనకంటే తక్కువ ఏజ్ ఉన్న హీరోతో కూడా నటించబోతుంది. రొమాంటిక్ ప్రేమ కథ జానర్ లో రాబోతున్న ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ చాలా వేగంగా జరుగుతుంది. అలా వరుస వివాదాలు ఎదుర్కొన్న కూడా నయనతార సినిమాల్లో తన జోరు మాత్రం తగ్గించడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: