సీనియర్ ఎన్టీఆర్ సీఎంగా మారిన తర్వాత రెండు రూపాయలకు కిలో బియ్యం అనే పథకాన్ని తీసుకోవచ్చారు. అలాగే జనతా వస్త్రాలు ,సంక్షేమ హాస్టల్లో అలాగే పటేల్ పట్వారి వ్యవస్థను సైతం రద్దు చేశారట. ఈ విషయాలతో సీనియర్ ఎన్టీఆర్కు తిరుగులేని కీర్తి అందుకున్నారు. సీనియర్ ఎన్టీఆర్ పోటీ చేసిన మొదటి ఎన్నికలలోనే 294 అసెంబ్లీ లకు గాను 204 సీట్లలో విజయాన్ని అందుకున్నారట. అలాగే 42 ఎంపీ సీట్లకు 35 ఎంపీ సీట్ల సైతం సాధించిన ఘనత అందుకున్నారు.
1994లో మళ్లీ ఎవరూ ఊహించని సీట్లతో అధికారంలోకి వచ్చిన సీనియర్ ఎన్టీఆర్.. మూడుసార్లు సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. ఆ తర్వాత కుటుంబ కలహాలు ఇబ్బందులు రావడంతో సీనియర్ ఎన్టీఆర్ టిడిపి పార్టీ పగ్గాలను చంద్రబాబు నాయుడు దక్కించుకున్నారు. ఆ తర్వాత సీఎంగా చంద్రబాబు నాయుడు అవ్వడం జరిగిందట. ఆ తర్వాత కుటుంబ కలహాలతో చంద్రబాబు చేసిన పనులతో తీవ్రమైన ఇబ్బందితో సీనియర్ ఎన్టీఆర్ కలత చెందేవారనీ ఇప్పటికి వార్తలు వినిపిస్తూ ఉంటాయి.. 1996 జనవరి 18న సీనియర్ ఎన్టీఆర్ కన్నుమూశారు.
అయితే సీనియర్ ఎన్టీఆర్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగించడానికి జూనియర్ ఎన్టీఆర్ రావాలని ఆయన అభిమానులు చాలామంది టీడీపీ నేతలు కోరుకుంటూన్నారు. కానీ ఎన్టీఆర్ మాత్రం రాజకీయాలకి రాలేదు.. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నారు. అలాగే సీనియర్ ఎన్టీఆర్ కూతురు పురందేశ్వరి కూడా ఎంపీగా కొనసాగుతోంది.