ఏ హీరో ఫ్యాన్స్ ఆ హీరో నటనను ఆ సినిమాను తెగ పోగిడేస్తున్నారు. మనకు తెలిసిందే సంక్రాంతి కానుకగా రామ్ చరణ్ నటించిన 'గేమ్ ఛేంజర్ ' సినిమా జనవరి 10వ తేదీ థియేటర్స్ లో రిలీజ్ అయి సూపర్ డూపర్ కలెక్షన్స్ సాధించింది. టాక్ ప్రకారం నెగిటివ్ ఫీడ్ బ్యాక్ అందుకున్న కలెక్షన్స్ మాత్రం ఓ రేంజ్ లో కుమ్మి పడేసింది. అదంతా రాంచరణ్ పుణ్యం అంటున్నారు మెగా ఫాన్స్ . ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది . ఆ తర్వాత రిలీజ్ అయిన 'డాకు మహారాజ్ ' సినిమా ఇండస్ట్రినీ ఏ రేంజ్ లో మడత పెట్టేసిందో అందరికీ తెలుసు .
జనవరి 12వ తేదీ బాలకృష్ణ నటించిన 'డాకు మహారాజ్ ' సినిమా గ్రాండ్గా థియేటర్స్ రిలీజ్ అయింది . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . ఈ సినిమా కూడా 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది . బాలయ్య వరుసగా నటించిన నాలుగు సినిమాలు 100 కోట్ల క్లబ్ లోకి చేరడం గమనార్హం. ఆ తర్వాత వచ్చిన వెంకటేష్ నటించిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకుంది. 'సంక్రాంతికి వస్తున్నాం ' సినిమా మూడు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది . ఇప్పటికి సక్సెస్ఫుల్గా థియేటర్స్ లో ఈ సినిమా ముందుకు వెళుతుంది . దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. అయితే ఈ సంక్రాంతికి రేసులో నిలిచిన ముగ్గురు హీరోలలో వెంకటేష్ రియల్ విన్నర్ గా నిలిచాడు. 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాకి అటు పాజిటివ్ టాక్ ఇటు కలెక్షన్స్ రెండూ కూడా కుమ్మి పడేస్తున్నాయి..!