ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ పాత్రలో మీనాక్షి చౌదరి కూడా తన నటనకు మంచి మార్కులు వేయించుకుంది . ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా వెంకటేష్ తర్వాత ఐశ్వర్య రాజేష్ క్యారెక్టర్ ని చాలా చక్కగా పొగిడేస్తున్నారు. సౌందర్య గారి తర్వాత వెంకటేష్ పక్కన అలాంటి ఒక పర్ఫామెన్స్ ఇచ్చింది ఐశ్వర్య రాజేష్ అంటూ నెక్స్ట్ ఇండస్ట్రీలో సౌందర్యగా మారిపోయేది ఐశ్వర్య రాజేష్ అంటూ తెగ పొగిడేస్తూ జనాలు మాట్లాడుకుంటున్నారు . కాగా ఇప్పుడు ఐశ్వర్య రాజేష్ ఖాతాలో బిగ్ బడా పాన్ ఇండియా సినిమా వచ్చి చేరినట్లు తెలుస్తుంది .
సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ సినిమాకి కమిట్ అయిన విషయం తెలిసిందే. బుచ్చిబాబు సినిమా షూట్ కంప్లీట్ అవ్వగానే ఈ సినిమా సెట్స్ పైకి రాబోతుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా సమంత అంటూ మాట్లాడుకున్నారు జనాలు . కాగా సమంత ఇప్పుడు సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు . ఆ కారణంగానే ఈ సినిమాలో సమంత ప్లేస్ ను రీప్లేస్ చేసే విధంగా నాచురల్ లుక్స్ తో ఆకట్టుకునే ఐశ్వర్య రాజేష్ ని చూస్ చేసుకున్నారట సుక్కు. దీంతో ఇప్పుడు ఐశ్వర్య రాజేష్ పేరు మారుమ్రోగిపోతుంది . నిజంగానే ఇది ఐశ్వర్య కెరియర్ ని టర్న్ చేసే రోల్ అంటూ ఆమె అభిమానులు తెగ పొగిడేస్తున్నారు . సుకుమార్ డైరెక్షన్ లో ఐశ్వర్య రాజేష్ అంటే మాత్రం అది వేరే లెవెల్ అని చెప్పాలి. చూద్దాం ఈ సినిమా ఐశ్వర్య రాజేష్ కెరియర్ ని ఎలా మలుపు తిప్పుతుందో..????