ఎక్కువ సంఖ్యలో థియేటర్లు దక్కి ఉంటే ఈ సినిమా కలెక్షన్లు మరింత మెరుగ్గా ఉండేవని చెప్పవచ్చు. డాకు మహారాజ్ మూవీ నైజాంలో ఇప్పటికే 10 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకోగా ఫుల్ రన్ లో 15 కోట్ల రూపాయలు సాధించే ఛాన్స్ ఉంది. అయితే నైజాంలో రాబోయే రోజుల్లో డాకు మహారాజ్ కు థియేటర్లు పెంచుతారేమో చూడాలి.
వాస్తవానికి డాకు మహారాజ్ మూవీకి ఆశించిన స్థాయిలో ప్రమోషన్స్ జరగలేదు. ప్రమోషన్స్ జరిగి ఉంటే మాత్రం ఈ సినిమా రేంజ్ మరింత పెరిగేదని చెప్పడంలో సందేహం అవసరం లేదు. డాకు మహారాజ్ మూవీ సక్సెస్ డైరెక్టర్ బాబీకి సైతం ఒక విధంగా ప్లస్ అవుతుందని చెప్పడంలో సందేహం అవసరం లేదు. డాకు మహారాజ్ మూవీ సక్సెస్ తో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ లకు ఆఫర్లు పెరుగుతున్నాయి.
డాకు మహారాజ్ సినిమాలో యాక్షన్ సీన్స్, ఎలివేషన్ సీన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. డాకు మహారాజ్ మూవీ సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. డాకు మహారాజ్ మూవీ ఇతర భాషల్లో ఏ రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. బాలయ్య అఖండ2 సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. బాలయ్య నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే కెరీర్ పరంగా మరిన్ని విజయాలు సొంతం అవుతాయని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు.